Sarkar Live

Privacy Policy

సంక్రాంతి 2026: హైదరాబాద్ ఆకాశంలో పతంగులు, బెలూన్లు, డ్రోన్ల విన్యాసాలకు సిద్ధం ‌‌ ‌‌- Kite Festival
Hyderabad

సంక్రాంతి 2026: హైదరాబాద్ ఆకాశంలో పతంగులు, బెలూన్లు, డ్రోన్ల విన్యాసాలకు సిద్ధం ‌‌ ‌‌- Kite Festival

International Kite Festival Hyderabad 2026 | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కేవలం వినోదానికే కాదు, ఆర్థిక, సాంస్కృతిక ప్రగతికి పర్యాటకాన్ని ఒక ప్రధాన చుక్కానిగా మార్చుకుంటోంది. 2026 సంక్రాంతి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ షో, డ్రోన్ షోలను అత్యంత ఘ‌నంగా నిర్వహించడానికి సిద్ధ‌మైంది. ప్రధాన ఆకర్షణలు ఇవే.. గగనతల విన్యాసాలు: 19 దేశాల నుండి 40 మంది అంతర్జాతీయ, 15 రాష్ట్రాల నుండి 55 మంది జాతీయ పతంగుల నిపుణులు పాల్గొంటున్నారు. రాత్రి వేళ ఆకాశంలో వెలుగులు చిమ్మే "నైట్ ఫ్లయింగ్" ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హైదరాబాద్‌లో స్థిరపడిన వివిధ దేశాలు, రాష్ట్రాల వారు తమ ఇళ్లలో తయారు చేసిన 1,200 రకాల మిఠాయిలను ఇక్కడ రుచి చూడవచ్చు. అధునాతన డ్రోన్ షో: గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఈ షోలో డ్రోన్లతో సాకర్ ...
Bhatti Vikramarka | అన్నదాతకు ‘విద్యుత్’ వెలుగులు: 3.44 లక్షల వ్యవసాయ కనెక్షన్లు.. ఇక ‘1912’కు కొడితే విద్యుత్ అంబులెన్స్ హాజరు!
State, Hyderabad

Bhatti Vikramarka | అన్నదాతకు ‘విద్యుత్’ వెలుగులు: 3.44 లక్షల వ్యవసాయ కనెక్షన్లు.. ఇక ‘1912’కు కొడితే విద్యుత్ అంబులెన్స్ హాజరు!

హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ, రైతులకు, సామాన్య ప్రజలకు నాణ్యమైన సేవలను చేరువ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వెల్లడించారు. సోమవారం శాసనమండలిలో క్వశ్చన్ అవర్ (ప్రశ్నోత్తరాల సమయం) సందర్భంగా విద్యుత్ శాఖపై జరిగిన చర్చకు ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. వ్యవసాయ కనెక్షన్ల జాతర: గణాంకాలు ఇవే.. గత ప్రభుత్వాల హయాంలో పేరుకుపోయిన పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తూ, విద్యుత్ శాఖ రికార్డు స్థాయిలో కనెక్షన్లు మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. 2022 జనవరి నుండి 2025 డిసెంబర్ వరకు మొత్తం 3,44,462 మంది రైతులకు కొత్త విద్యుత్ కనెక్షన్లు కల్పించారు. పెరిగిన లోడ్‌కు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా 75,686 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. గడిచిన రెండేళ్లలోనే (2024, 2025) సుమారు 2 లక్షల అదనపు క...
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్:
State, Hyderabad

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్:

14 మంది మావోయిస్టుల మృతి.. కీలక నేత హతం! రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అడవుల్లో మరోసారి తూటాల గర్జన వినిపించింది. శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మొత్తం 14 మంది మావోయిస్టులు (Maoist Encounter) మరణించారు. వీరిలో ఒక కీలక నేత కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. సుక్మా జిల్లాలో 12 మంది మృతి సుక్మా జిల్లాలోని కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున పామ్లూరు గ్రామం సమీపంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ముఖ్య నేత హతం: ఈ ఎన్‌కౌంటర్‌లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి 'మంగడు' మరణించారు. ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. మృతులు: మొత్తం 12 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్...
Indiramma Indlu | పేదవాడి సొంతింటి కల నిజం చేస్తాం : మంత్రి పొంగులేటి
State, Hyderabad

Indiramma Indlu | పేదవాడి సొంతింటి కల నిజం చేస్తాం : మంత్రి పొంగులేటి

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. శనివారం శాసనసభలో ఇందిరమ్మ ఇండ్ల పథకం (Indiramma Indlu ) పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అనేది కేవలం ఎన్నికల హామీ కాదని, ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మొదటి విడతలో భాగంగా మంజూరు చేసిన 4.50 లక్షల ఇండ్లలో, ప్రస్తుతం 3 లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. మరో 52 వేల ఇండ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం మార్చి - ఏప్రిల్ నెలల్లో కొత్త ఇండ్ల మంజూరు చేపడతామని వెల్లడించారు. వచ్చే వర్షాకాలం నాటికి తొలి విడత ఇండ్లన్నీ పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. మొదటి విడత తర్వాత మరో మూడు విడతలుగా ఇండ్ల మంజూరు ప్రక్రి...
Maoist Surrender : మావోయిస్టులకు భారీ షాక్..
Crime

Maoist Surrender : మావోయిస్టులకు భారీ షాక్..

పీఎల్జీఏ చీఫ్ బర్సే దేవా లొంగుబాటు.. డీజీపీ ముందు సరెండర్! హైదరాబాద్, జనవరి 2: తెలంగాణలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీలో అత్యంత కీలక నేత, పీఎల్జీఏ (పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ) చీఫ్ బర్సే దేవా శుక్రవారం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు (Maoist Surrender) . పార్టీ బలహీనపడటం, ఆరోగ్య సమస్యలు మరియు ఇటీవల జరిగిన వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఆయన జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఎవరీ బర్సే దేవా? బర్సే దేవా మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైన నాయకుడు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత, పార్టీ సాయుధ బలగాల బాధ్యతలను దేవానే చూస్తున్నారు. వీళ్లిద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడం గమనార్హం. పార్టీకి ఆయుధాల సరఫరా చేయడంలో మరియు దాడుల వ్యూహరచనలో దేవాది కీలక పాత్ర పోషించాడు. లొంగిపోయిన సమయంలో దేవా వద్ద ఉన్న అత్యాధునిక 'మౌంటెన...
error: Content is protected !!