Son kills mother | కొడుకు చేతిలో తల్లి హతం.. మద్యం మత్తులో ఉన్మాదం
Son kills mother : రంగారెడ్డి జిల్లా చెవెళ్ల (Chevella)లో జరిగిన దారుణ సంఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్నతల్లిని కొడవలితో దాడి చేసి హతమార్చాడు. ఆ తర్వాత గ్రామస్థులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
చెవెళ్ల మండలంలోని రెగడఘనపూర్ గ్రామం (Regadghanapur)లో నివసిస్తున్న జంగయ్య తన తల్లి నర్సమ్మ (75)తో కలిసి ఉండేవాడు. మద్యం మత్తులో అతడు తల్లితో ఏదో ఒక విషయంపై వాగ్వాదానికి దిగాడు. కొద్ది సేపటికే అతడు మరింత కోపోద్రిక్తుడై విచక్షణ కోల్పోయి ఉన్మాదిగా మారాడు. ఇంట్లోనే ఉన్న కోడవలిని తీసి తల్లిపై దాడి చేసి (attacking) అత్యంత కిరాతకంగా గాయపర్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన శనివారం రాత్రే జరిగినప్పటికీ ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నర్సమ్మ మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే జంగయ్యను పట్టుకొని చెట్...




