Sarkar Live

Privacy Policy

Manipur | మణిపూర్ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధం – రూ.8,500 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం
National

Manipur | మణిపూర్ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధం – రూ.8,500 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం

2023 హింస చెలరేగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా రేపు మణిపూర్‌లో పర్యటించనున్నారు. మణిపూర్ (Manipur) ప్రధాన కార్యదర్శి పునీత్ కుమార్ గోయెల్ శుక్రవారం మాట్లాడుతూ ప్రధాని మోదీ సెప్టెంబర్ 13న ఈశాన్య రాష్ట్రాన్ని సందర్శిస్తారని, రూ.8,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారని చెప్పారు. ప్రధాని మోదీ మణిపూర్ షెడ్యూల్ ప్రధానమంత్రి ముందుగా మిజోరం నుండి చురచంద్‌పూర్‌కు చేరుకుంటారని, ఆ తర్వాత రాజధాని ఇంఫాల్‌కు వెళతారని ఆయన చెప్పారు. "మణిపూర్ సమగ్ర అభివృద్ధికి తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధానమంత్రి చురచంద్‌పూర్‌లో రూ. 7,300 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు" అని గోయెల్ ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. సెప్టెంబర్ 13న ఇంఫాల్‌లో రూ.1,200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ పర్యటన మణిపూర్‌లో శాంతి, సాధా...
Dairy Milk Price : అమూల్, మదర్ డైరీ పాల ధరలు తగ్గుతున్నాయా? తాజా అప్‌డేట్ ఇదే..
LifeStyle

Dairy Milk Price : అమూల్, మదర్ డైరీ పాల ధరలు తగ్గుతున్నాయా? తాజా అప్‌డేట్ ఇదే..

Dairy Milk Price : దేశంలో జీఎస్టీ (GST) సంస్కరణల ప్రభావం పాల ఉత్పత్తులపై కూడా కనిపించనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పాలు, పాలు సంబంధిత ఉత్పత్తులపై పన్ను జీరోకి త‌గ్గించ‌డంతో వినియోగదారులకు ఉపశమనం లభించ‌నుంది. ముఖ్యంగా అమూల్ (Amul), మదర్ డైరీ (Mother Dairy) సంస్థలు కొత్త ధరలను ప్రకటించాయి. అమూల్ పాలు అమూల్ తాజా పౌచ్ పాలపై ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు పౌచ్ పాలపై జీఎస్టీ 0 శాతం ఉండటంతో ధరలు అలాగే కొనసాగుతాయి. అయితే అమూల్ టెట్రా ప్యాక్ (UHT milk) పాల ధర మాత్రం తగ్గనుంది. UHT పాలు ఎక్కువ రోజులు ఫ్రిజ్ అవసరం లేకుండా నిల్వ ఉండే ప్రత్యేకత కలిగి ఉంటాయి. మదర్ డెయిరీ పాల ధర లీటరుకు 3 నుండి 4 రూపాయలు తగ్గవచ్చు. అమూల్ టెట్రా ప్యాకెట్ పాల ధర మాత్రమే తగ్గుతుంది. UHT పాలను మీరు చాలా నెలలు ఫ్రిజ్‌లో ఉంచకుండానే ఉపయోగించవచ్చు. UHT ప్రక్రియలో, పాలను కనీసం 135 డిగ్రీల సెల్సియస్‌కు ...
Tollywood | నితిన్ – శ్రీను వైట్ల – మైత్రి మూవీ మేకర్స్: ఊహించని కాంబో సెటప్?
Cinema

Tollywood | నితిన్ – శ్రీను వైట్ల – మైత్రి మూవీ మేకర్స్: ఊహించని కాంబో సెటప్?

Tollywood News | సినిమా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు ఆడియన్స్ ఊహించని కాంబోలు సెట్ అవుతూ సర్ప్రైజ్ ఇస్తుంటారు. హిట్స్ లో ఉన్న డైరెక్టర్ తోనే ఏ హీరో అయినా చేయాలనుకుంటారు. అలాగే హిట్స్ లో ఉన్న హీరో తో చేస్తే నే మూవీ పై హైప్ క్రియేట్ అవుతుందని డైరెక్టర్ అనుకుంటాడు. ఇక ప్రొడ్యూసర్స్ కూడా హిట్టు కొట్టిన వాళ్ల వెంటనే పడుతుంటారు. కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ కాంబో సెట్ అయినట్టు ఫిలిం నగర్ లో టాక్ వినబడుతోంది. ఈ కాంబో రిస్క్ చేస్తోందా… ? మైత్రి మూవీ మేకర్స్(maithri movie makers)బ్యానర్ లో నితిన్(nithin) హీరోగా శ్రీను వైట్ల(Sreenu vaitla)డైరెక్షన్ లో ఓ మూవీ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు కూడా హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా నితిన్ వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్నారు. ఇక శ్రీను వైట్ల హిట్టు కొట్టి చాలా కాలమే అయిపోయింది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోయిన మైత్రి బ్యానర్ కు క...
ఇందిర‌మ్మ ఇండ్ల‌ లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్  – Indiramma Housing Scheme
State, Hyderabad

ఇందిర‌మ్మ ఇండ్ల‌ లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ – Indiramma Housing Scheme

Indiramma Housing Scheme : రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) గురువారం హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల కాల్ సెంటర్ (Indiramma Housing Scheme Toll Free: 1800 599 5991)ను ప్రారంభించారు. ఈ కాల్ సెంటర్ ద్వారా లబ్ధిదారులు తమ సమస్యలు, సందేహాలు నేరుగా అధికారులకు తెలియజేసే అవకాశం కల్పించారు. కాల్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వం త‌ర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి , ప్రజలకు మధ్య జరిగిన సంభాషణ ఆస‌క్తిక‌రంగా సాగింంది. హలో నేను హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని మాట్లాడుతున్నాను… మీరు ఎక్క‌డినుంచి మాట్లాడుతున్నారు? మీ సమస్య ఏమిటి ? చెప్పండి.ఫోన్ చేసిన వ్య‌క్తి :- సర్ మాది వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం .. బేస్మెంట్ వరకు మా ఇల్లు పూర్తి అయ్యింది. ఇంకా బిల్లు రాలేదు…మంత్రి :- బేస్‌మెంట్ పూర్త‌యి ఎన్నిర...
తెలంగాణ‌లో కొత్త రైల్వే లైన్లపై కీల‌క అప్‌డేట్ – Vikarabad Krishna Railway line
Hyderabad, State

తెలంగాణ‌లో కొత్త రైల్వే లైన్లపై కీల‌క అప్‌డేట్ – Vikarabad Krishna Railway line

Hyderabad News : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టుల (Telangana Railway Projects) పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వికారాబాద్–కృష్ణా కొత్త రైల్వే లైన్ (Vikarabad Krishna Railway line) పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాల‌ని ఆదేశించారు. తెలంగాణలోని ఇండస్ట్రియల్ సెక్టార్ అభివృద్ధి కోసం ప్రత్యేక రైల్వే లైన్ అవసరమని సీఎం రేవంత్ సూచించారు. ఇందు కోసం భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్ రవాణా అవసరాలకు కీలకమని ఆయన వివరించారు. అలాగే శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ (Bullet Train) ప్రాజెక్టు సా...
error: Content is protected !!