Sarkar Live

Privacy Policy

Sponge Parks | మోంతా తుఫాను తర్వాత వరంగల్‌ నగరంలో స్పాంజ్ పార్కుల నిర్మాణానికి అడుగులు
State, warangal

Sponge Parks | మోంతా తుఫాను తర్వాత వరంగల్‌ నగరంలో స్పాంజ్ పార్కుల నిర్మాణానికి అడుగులు

Sponge Parks in Warangal : త‌ర‌చూ భారీ వర్షాల‌తో మునిగిపోతున్న వరంగల్‌, హన్మకొండ నగరాలు ఇకపై పచ్చని రక్షణ కవచాన్ని పొందబోతున్నాయి. భూగర్భ జలాలను నిల్వ చేస్తూ, వరదలను అడ్డుకునే ‘స్పాంజ్ పార్క్‌’లు నగరపు భవిష్యత్తు పర్యావరణ సమతుల్యతను సాధించ‌నున్నాయి. హన్మకొండ, వరంగల్ నగరాల్లో ఇటీవ‌ల‌ మోంథా తుఫాను కారణంగా 120 కంటే ఎక్కువ కాలనీలు మునిగిపోయిన నేప‌థ్యంలో , గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఒక సుస్థిర పట్టణ పరిష్కారాన్ని అమలులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. నగరంలోని వరద ముప్పును తగ్గించి, భూగర్భ జలాల స్థాయిని పెంచడానికి “స్పాంజ్ పార్క్‌లు” అనే వినూత్న ప్రాజెక్ట్ ను మొద‌లుపెడుతోంది. స్పాంజ్ పార్క్‌లు వర్షపు నీటిని సహజంగా పీల్చుకుని భూమిలోకి మళ్లించే ప్రదేశాలు. ఇవి నగరంలోని తక్కువ భూమి ఉన్న‌ ప్రాంతాల్లో వరదలను తగ్గించడమే కాకుండా, నీటి నిల్వకు కూడా తోడ్పడతాయి.చ...
రూ. 2కోట్ల ధాన్యం హాంఫట్? Civil supply
Special Stories

రూ. 2కోట్ల ధాన్యం హాంఫట్? Civil supply

మంజునాధ ఏంది నీ దందా .. Civil supply scam : ప్రభుత్వం నుండి ధాన్యం దింపుకోవడం ,అందులోనుండి సగానికి పైగా మాయం చేయడం కొంతమంది మిల్లర్ లకు అలవాటుగా మారినట్లు తెలుస్తోంది.హన్మకొండ జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో ఉన్న రికార్డులకు, క్షేత్రస్థాయిలో మిల్లుల్లో ఉన్న ధాన్యానికి భారీ ఎత్తున వ్యత్యాసం ఉండటం పౌరసరఫరాల శాఖలో కలకలం రేపుతోంది. తాజాగా ఇప్పుడు మరో మిల్లర్ 2 కోట్లకు పైగా ధాన్యం మాయం చేయడం, ఆ విషయం ఇప్పటివరకు కూడా సివిల్ సప్లై అధికారులకు తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2 కోట్ల ధాన్యం ఎటుపోయింది ? అక్షరాల రెండు కోట్లు విలువ చేసే ధాన్యం ఎక్కడ పోయినట్లు..?బహిరంగ మార్కెట్ కు తరలించారా ?కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా మ్యాజిక్ జరిగిందా?అనే విషయాలు పక్కన పెడితే అంత పెద్ద మొత్తంలో ఆ మిల్లులో ధాన్యం లేని విషయాన్ని సంబంధిత "డిటి" ఎందుకు గుర్తించలేదు? అనేది ప్రశ్న.వివరాల్లోకెళితే హన్మకొండ జ...
చీమలకు భయపడి మహిళ ఆత్మహత్య ‌‌ – Sangareddy
Crime, Viral

చీమలకు భయపడి మహిళ ఆత్మహత్య ‌‌ – Sangareddy

Sangareddy | ఓ మహిళ మానసిక సమస్యలతో బాధపడుతూ తీవ్ర నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అత్యంత అరుదైన ఘటన అందరినీ కలచివేసింది. చీమల ఫోబియాతో (Myrmecophobia) ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా (Sangareddy district) అమీన్‌పూర్ లో నివసిస్తున్న గృహిణి మనీషా, ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వదిలిన సూసైడ్ నోట్‌లో “నాకు చీమలంటే చాలా భయం.. ఆ భయం నన్ను చంపేస్తోంది. నా కూతురిని జాగ్రత్తగా చూసుకోండి” అని రాసి ఉంది. ఈ లేఖను చూసిన కుటుంబ సభ్యులు, పోలీసులు, ఇరుగుపొరుగువారు షాక్‌కు గురయ్యారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు, కుటుంబ విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చీమల పట్ల భయం అనేది ఓ చిన్న విషయం. అయితే దీనికేగా ఆమె ప్రాణం తీస్తుకుంటుందని ఎవరూ ఊహించలేదు. గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రమాద సమాచారం అందుకున్న అమీన్‌పూర్ పోలీసులు సంఘటనా స్థల...
ఈ రోడ్డు భ‌య‌పెడుతోంది.. కమిషనర్ మేడం.. కాస్త‌ కనికరించండి.. – Dangerous Roads in Warangal
Special Stories

ఈ రోడ్డు భ‌య‌పెడుతోంది.. కమిషనర్ మేడం.. కాస్త‌ కనికరించండి.. – Dangerous Roads in Warangal

పూర్తిగా ధ్వ‌సంమైన ప్ర‌గ‌తి ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియా - రెడ్డిపాలెం ర‌హ‌దారి ఇదే రోడ్డుపై ఇన్‌ఫాంట్ జీసస్‌, విద్యానిలయ స్కూళ్లు నిత్యం స్కూల్ బ‌స్సుల్లో వంద‌లాది విద్యార్థులు.. భ‌యం గుప్పిట్లో ప్ర‌యాణం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా జీడ‌బ్ల్యూఎంసీ నిశ్శబ్దం.. తల్లిదండ్రుల్లో ఆగ్రహం “కమిషనర్‌ చాహత్‌ బాజ్‌ పేయి స్పందించాల‌ని వేడుకోలు Dangerous Roads in Warangal | ఇటీవల చేవెళ్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో క‌ళాశాల‌ల‌కు వెళ్లే విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఆ దృశ్యం చూసి ప్రజలంతా షాక్‌కు గురై ఇప్ప‌టికీ తేరుకోలేదు.. అయితే ఆ ప్రమాదం తీవ్ర‌త‌ను తలపించేలా మరో అత్యంత ప్రమాద‌క‌ర‌మైన ర‌హ‌దారి ఇప్పుడు వరంగల్‌లో ఉందంటే మీరు నమ్మగలరా? గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని ప్ర‌గ‌తి ఇండస్ట్రియ‌ల్ ఏరియా- రెడ్డిపాలెం రోడ్డు.. ఇప్పుడు ఇది ప్రమాదాల బాటగా మారింది. పుస్తకాల బరు...
కార్తీక పౌర్ణమి వేడుకలు.. శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ – Karthika Pournami 2025
LifeStyle

కార్తీక పౌర్ణమి వేడుకలు.. శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ – Karthika Pournami 2025

Karthika Pournami 2025 | కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరంగల్‌ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, భ‌ద్ర‌కాళి ఆల‌యం, వ‌రంగ‌ల్‌లోని క‌ట్ట‌మ‌ల్ల‌న్న‌దేవాల‌యం, కోటిలింగాల దేవాల‌యం, ఐన‌వోలు మ‌ల్లికార్జున‌స్వామి దేవాల‌యం, ములుగు జిల్లా రామప్ప, భూపాల‌ప‌ల్లి జిల్లా కాళేశ్వరం, హ‌నుమ‌కొండ‌లోని సిద్దేశ్వరాలయం, కోటగుళ్లు, పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో భ‌క్తులు పోటెత్తారు. మ‌హ‌దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ త‌మ మొక్కులు తీర్చుకుంటున్నారు. పుణ్యస్నానాలు, దీపోత్సవాలు కార్తీక పౌర్ణ‌మిని పుర‌స్క‌రించుకొని కాళేశ్వరం వ‌ద్ద గోదావ‌రి త్రివేణి సంగమంలో పెద్ద సంఖ్య‌లో మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే భద్రాచలం వద్ద గోదావరి ఘాట్‌ల వద్ద భక్తులు స్నానాలు చేసి, ఆలయంలో కార్తీ...
error: Content is protected !!