Jubilee Hills Byelection | జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలు కావాలి : కేటీఆర్
Hyderabad : త్వరలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills Byelection) ఉంటుందని, ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మళ్లీ మన జైత్రయాత్ర కొనసాగిద్దామని భారత రాష్ట్ర సమితి (BRS Party) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు.తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశం బుధవారం జరిగింది. కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మాగంటి సునీత (Maganti Sunitha)కు అందరి ఆశీస్సులు, అండదండలు ఉంటాయని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో పార్టీని గెలిపించడమే గోపీనాథ్‌కు సరైన నివాళి అని తెలిపారు. ఓటుకు రూ.5 వేలు పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. సీఎం సోదరుడు చెరువు...




