తుదిదశకు హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ భూసేకరణ, కొనసాగుతున్న కూల్చివేతలు – Old City metro corridor
Hyderabad Metro news : 7.5 కి.మీ ఓల్డ్ సిటీ మెట్రో రైల్ కారిడార్ (Old City metro corridor) వెంబడి భూసేకరణ, కూల్చివేత పనులు కీలక దశకు చేరుకున్నాయి. అవసరమైన రైట్ ఆఫ్ వే (RoW) క్రమంగా అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు మొత్తం 886 ఆస్తుల్లో 550 కంటే ఎక్కువ కూల్చివేశారు. మిగతా నిర్మాణాల తొలగింపు పనులు సైతం జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఆస్తి యజమానులకు ప్రభుత్వం రూ.433 కోట్ల పరిహారం చెల్లించింది.
వర్షాలు, పండుగలు, మొహర్రం ఊరేగింపులు వంటి సవాళ్ల మధ్య కూడా పనులు పెద్దగా ఇబ్బంది కలగకుండా సజావుగా జరిగాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అధికారులు తెలిపారు. భూగర్భ విద్యుత్ కేబుల్ మార్పిడి మొదట అడ్డంకిగా మారినా ఇప్పుడు సమస్యలు పరిష్కరించబడ్డాయి.
మెట్రో పిల్లర్లు, స్టేషన్ నిర్మాణానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఖచ్చితమైన మ్యాపింగ్ కోసం డిఫరెన్షియల్ GPS (DGPS) సర్వేలు నిర్వహిస్తున్నారు....




