Sarkar Live

Privacy Policy

Nizamabad : నిజామాబాద్‌లో జంట హత్యలతో కలకలం
Crime, Nizamabad

Nizamabad : నిజామాబాద్‌లో జంట హత్యలతో కలకలం

Nizamabad : నిజామాబాద్ జిల్లా (Nizamabad) మాక్లూరు మండలం ధర్మోరా(ఏ) గ్రామంలో జంట హత్యలు క‌ల‌క‌లం సృష్టించాయి. ఆదివారం రాత్రి నిజామాబాద్ లోని గౌతమ్ నగర్‌కు చెందిన జిలకర ప్రసాద్ తన స్నేహితుడితో కలిసి ధర్మోరాలో తనకు పరిచయం ఉన్న ఓ మహిళ ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మహిళ బంధువులకు ప్రసాద్‌కు మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి గొడ‌వ‌ పెద్దది కావడంతో ఒక‌రికొక‌రు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో జీలకర్ర ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, అతడి స్నేహితుడు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జంట హత్యలతో గ్రామం ఒక్క‌సారిగా షాక్ కు గురైంది. ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. దీంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటన అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ప్రసాద్‌పై అనేక చోరీ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్యలకు వివాహేతర సంబంధమే కారణ...
Ragging | ర్యాగింగ్‌పై కఠిన చర్యలు : వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరిక
warangal, State

Ragging | ర్యాగింగ్‌పై కఠిన చర్యలు : వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరిక

Warangal News | విద్యాసంస్థల్లో ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ (Ragging) వంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై చ‌ట్ట ప్ర‌కారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ (Warangal CP) స‌న్‌ప్రీత్ సింగ్‌ హెచ్చరించారు. త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోవుతున్న నేప‌థ్యంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ర్యాగింగ్‌ నియంత్రణపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ ఆదివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడడ‌మ‌నేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని, ఈ చర్యల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేలా ఉంటుంద‌ని అన్నారు. ముఖ్యంగా సీనియర్ల ముసుగులో జూనియర్‌ విద్యార్థుల పట్ల అసాంఘిక కృత్యాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తూ విద్యాసంస్థల నుంచి తొలగించడంతో పాటు ర్యాగింగ్‌ లాంటి చర్యలకు పాల్పడే విద్యార్థులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ర్యాగింగ్‌ పా...
BRS Party | పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి : కేటీఆర్ సవాల్
State, Hyderabad

BRS Party | పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి : కేటీఆర్ సవాల్

Hyderabad | పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే వారి పదవులకు రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ (BRS Party ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. రేవంత్‌ రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని చెప్పారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎన్నికలు వస్తే ఓటమి భయం పట్టుకుందని సెటైర్లు వేశారు. శేరిలింగంపల్లి (sharlingampalli) నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఓటువేసిన ప్రజలను నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ కొనియాడారు. హైదరాబాద్​ లో కాంగ్రెస్ నేతల దందాల కోసమే హైడ్రా పనిచేస్తోందని ఆరోపించారు. హైడ్రా (Hydraa) కారణంగానే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనల...
సహస్ర హత్య కేసులో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన సీపీ – Sahasra Murder Case
Crime

సహస్ర హత్య కేసులో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన సీపీ – Sahasra Murder Case

Sahasra Murder Case | కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో సీపీ అవినాష్ మహంతి విస్తుపోయే వాస్త‌వాలు మీడియాకు వెల్ల‌డించారు. 14 ఏళ్ల పిల్లాడే త‌న ఇంటి ప‌క్క‌న ఉంటున్న సహస్రను హత్య చేశాడని తెలిపారు. ఆయ‌న క‌థ‌నం ప్ర‌కారం.. సహస్ర తమ్ముడితో త‌ర‌చూ క్రికెట్ ఆడే నిందితుడికి ఆ పిల్లాడి వ‌ద్ద క్రికెట్ బ్యాట్ నచ్చింది. కానీ సహస్ర తమ్ముడు ఎక్కువగా ఆ బ్యాట్‌ని నిందితుడికి ఇచ్చేవాడు కాదు. ఎలాగైనా ఆ బ్యాట్ ను తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న 14 ఏళ్ల నిందితుడు.. దాని కోసమే స‌హ‌స్ర‌ ఇంటికి వెళ్లాడు. బ్యాట్ తీసుకొని.. వెనక్కి వస్తుండగా.. అదే స‌మ‌యంలో సహస్ర చూసి కేకలు వేసింది. వెంట‌నే స‌ద‌రు నిందితుడు ఆమెను బెడ్‌రూంలోకి తీసుకెళ్లాడు. అంతటితో ఆగ‌కుండా కత్తితో పాశ‌వికంగా పొడిచేశాడని పోలీసులు వెల్ల‌డించారు. మరి ఆ బ్యాట్‌ని తల్లిదండ్రుల ద్వారా కొనిపించుకోవచ్చు కదా అంటే.. ఆ పిల్లాడు.. అంత ఖరీదైన బ్యాట్‌ని తన తల్లిదండ్...
Suryapet | పట్టపగలే అందరూ చూస్తుండగానే హత్యాయత్నం
Crime

Suryapet | పట్టపగలే అందరూ చూస్తుండగానే హత్యాయత్నం

Suryapet news | సూర్యాపేటలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను హత్య చేయడానికి దుండగులు కారులో వెంబడించారు. ఈ సంఘటన సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని బీబీగూడెం సమీపంలోని ఓ వైన్స్ ముందు తీవ్ర భయాందోళనలు సృష్టించింది. వివరాల్లోకి వెళితే సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి శుక్రవారం బైక్ పై వెళ్తున్న ముగ్గురిని (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) గుర్తుతెలియని వ్యక్తులు కారులో వెంబడించగా బీబీ గూడెం సమీపంలో ఉన్న ఓ వైన్స్ షాపు ముందు బైక్ బయటపడవేసి ఆందోళనతో వైన్స్ లోపలికి వెళ్లారు. బైక్ ను వెంబడిస్తూ వస్తున్న దుండగులు కారు నుంచి దిగి ఆ ముగ్గురిని చంపడానికి కత్తులు, కర్రలతో వైన్స్ వైపు పరుగెత్తారు. ఈ క్రమంలో వైన్స్ షాప్ లో ఉన్న వారు ఒక్కసారిగా బయటికి రావడంతో వారిని చూసి కారెక్కి పారిపోయారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చ...
error: Content is protected !!