Sarkar Live

Privacy Policy

Heavy Rains | ఆగ‌ని వ‌ర్షాలు.. హెచ్చ‌రిక‌లు జారీ
State

Heavy Rains | ఆగ‌ని వ‌ర్షాలు.. హెచ్చ‌రిక‌లు జారీ

Heavy Rains in Telangana : తెలంగాణలో ఎడ‌తెర‌పిలేకుండా భారీ వ‌ర్షాలు (heavy rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ (southern Telangana)లోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇంకా ఇవి కొన‌సాగొచ్చ‌ని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట త‌దిత‌ర‌ జిల్లాల్లో ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. Heavy Rains : ఎక్క‌డెక్క‌డ అంటే.. ప్రస్తుతం ఉన్న తక్కువ వాయు పీడన (low-pressure) పరిస్థితులు సముద్ర మట్టం నుంచి పైపొరల వరకు చురుగ్గా ఉన్నాయి. దీని కారణంగా వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది. వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జన‌గాం, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, పెద్దప...
Earthquake | వికారాబాద్‌లో  భూకంపం.. ఓవైపు భారీ వ‌ర్షాలు.. మరోవైపు ప్ర‌కంప‌న‌లు
Hyderabad, State

Earthquake | వికారాబాద్‌లో భూకంపం.. ఓవైపు భారీ వ‌ర్షాలు.. మరోవైపు ప్ర‌కంప‌న‌లు

ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు Earthquake : వికారాబాద్ జిల్లాలో ఈ రోజు తెల్ల‌వారుజామున భూమి కంపించింది. భారీ వ‌ర్షం న‌డుమ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రత న‌మోదైంద‌ని అధికారులు తెలిపారు. కొన్ని సెకన్లపాటు మాత్రమే ఈ ప్ర‌కంప‌న‌లు కొన‌సాగాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. ఈ సంఘటన భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో చోటుచేసుకోవడంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ప్రకంపనలు ఎక్కడెక్క‌డ అంటే.. తెల్లవారుజామున సుమారు 3.45 గంటల సమయంలో బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్‌నగర్, ప‌రిగి పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ప్రత్యేకంగా జిల్లాకు ఆగ్నేయ దిశలో ఉన్న మండలాల్లో ఇవి ఎక్కువగా క‌నిపించాయ‌ని స్థానికులు చెబుతున్నారు. దీని ప‌రిస్థితిపై సహజ విపత్తుల విభాగం అధికారులు సమీక్షిస్తున్నారు. Earthquake : రెండు విపత్తుల కలయిక సాధారణంగా ఒక ప్రాంతంలో ఒ...
War-2 Movie review : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్!
Cinema

War-2 Movie review : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్!

War-2 Movie review | యంగ్ టైగర్ ఎన్టీఆర్,హృతిక్ రోషన్ కాంబోలో హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన మూవీ వార్2. ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ కావడం, టాలీవుడ్, బాలీవుడ్ లో టాప్ యాక్టర్స్ మల్టీస్టారర్ కావడంతో ఆడియన్స్ ఈగర్లీ వెయిట్ చేశారు. బాలీవుడ్ లో టాప్ బ్యానర్ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై అయాన్ ముఖర్జీ ఈ మూవీని డైరెక్ట్ చేసారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేశారు.ఎన్టీఆర్ హృతిక్ ల కాంబోలో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ను మెప్పించిందా…లేదా చూద్దాం. స్టోరీ ఇదీ.. హృతిక్ రోషన్ ను పట్టుకోవడానికి పోలీసులు తెగ ప్రయత్నం చేస్తుంటారు. వారి ప్రయత్నాలు విఫలం అవుతుండడంతో అతడిని పట్టుకోవడానికి ఒక స్పై (ఎన్టీఆర్) ని సెలెక్ట్ చేస్తారు. స్పై అతడిని పట్టుకోవడంలో ఎదురయ్యే సమస్యలేంటీ..? అసలు అతడిని పట్టుకున్నాడా లేదా..? అనేది కథ. War-2 మూవీ ఎలా ఉందంటే…. మూవ...
Viral Video | కస్టమర్ కు షాకిచ్చిన కూల్ డ్రింక్
Viral

Viral Video | కస్టమర్ కు షాకిచ్చిన కూల్ డ్రింక్

కూల్ డ్రింక్ బాటిల్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు (Plastic waste)? కంగుతిన్న కస్టమర్.. ఆశ్చర్యపోయిన షాపు యజమాని Warangal Viral Video | పండుగలు, పార్టీలకు, చిన్నచిన్న వేడుకల్లో కూల్ డ్రింక్స్ తీసుకోవడం సర్వసాధారణమే కదా.. అయితే మనం తీసుకునే కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివేనా? అవి తీసుకోవడం లాభమా? నష్టమా అనేది పక్కన పెడితే.. అసలు ఆ బాటిల్ ప్యాకింగ్ సమయాల్లో కంపెనీలు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా? అనే ప్రశ్నలు వరంగల్​ (Warangal) లో జరిగిన షాకింగ్​ ఘటనతో ఉత్పన్నమవుతున్నాయి. వివరాల్లోకెళితే వరంగల్ జిల్లా అబ్బనికుంటలో రాఖీ పండుగ రోజున ఓ కూల్ డ్రింక్స్ షాపునకు ఓ వ్యక్తి sprite తాగేందుకు వెళ్ళాడు. షాపు యజమాని కస్టమర్ కు sprite ను 250మి.లీ బాటిల్​ ఇవ్వగా, ఆ కస్టమర్ బాటిల్​ మూత ఓపెన్ చేసే సమయంలో ఒక్కసారిగా అందులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను (Plastic waste) చూసి షాకయ్యాడు. సదరు వ్యక్తి ...
మళ్లీ మేకప్ వేసుకున్న వడ్డే నవీన్ – Vadde Naveen comeback
Cinema

మళ్లీ మేకప్ వేసుకున్న వడ్డే నవీన్ – Vadde Naveen comeback

Transfer Thrimurthulu Movie | ఒకప్పుడు వరుస హిట్టు సినిమాలతో కుర్రకారును ఉర్రూతలూగించిన హీరో వడ్డే నవీన్ (Vadde Naveen)మళ్లీ యాక్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ లో సెలెబ్రెటీల ఇంటర్వ్యూల కింద కామెంట్స్ చూస్తే తన ఫాలోయింగ్ అప్పట్లో ఏ రేంజ్ లో ఉండేది అర్థం అవుతుంది. నవీన్ మళ్లీ ఎప్పుడూ యాక్ట్ చేస్తారో అని వెయిట్ చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వారందరూ కోరుకున్నట్టుగానే నవీన్ సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ హీరోగా అలరించబోతున్నాడు. దాదాపు 15 ఏళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ వెటరన్ స్టార్ మళ్ళీ మేకప్ వేసుకున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు ఈ హీరో. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి మూవీ అప్పట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఆ మూవీ తర్వాత నవీన్ కి యూత్ లో పాపులారిటీ పెరిగింది. ఆ తర్వాత కోరుకున్న ప్రియుడు,బాగున్నారా,చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒ ట్టు మీ ఆవిడ చాలా మంచిది,మా బ...
error: Content is protected !!