Puri Jagannadh movies : టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) నుండి మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ లో ఓ క్రేజ్ ఉంటుంది. హీరోయిజం చూపెట్టడంలో పూరీని మించిన డైరెక్టర్ లేడనడంలో అతిశయోక్తి కాదు.ఈ మాటను తన తోటి డైరెక్టర్లు కూడా ఇష్టపడుతారు. వరుస హిట్లతో బాక్సాఫీస్ నీ షేక్ చేసిన పూరి కొంతకాలం నుండి ఆడియన్స్ పల్స్ ని మిస్ అయ్యాడు. దశాబ్ద కాలంలో తన నుండి చాలా మూవీస్ వచ్చాయి.
Puri Jagannadh : మళ్లీ పరాజయాల బాటే…
జూనియర్ ఎన్టీఆర్(NTR) తో టెంపర్ హిట్టు కొట్టాక చాలా కాలం ఫ్లాఫ్ లే తీశాడు. డైరెక్టర్ గా ఫెయిల్ అవుతూ ప్రొడ్యూసర్ గా కూడా లాస్ అయ్యాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram) తో ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ఫామ్ అందుకున్నట్టే అనిపించింది. ఆ మూవీ మునుపటి పూరీ మూవీస్ ని గుర్తుకుతెచ్చింది. పూరీ హీరో అంటే ఇలా కదా ఉండాల్సింది అనుకున్నారు.ఇందులో పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ మణిశర్మను గుర్తుకుతెచ్చేలా ప్రతీ పాటను కూడా ఎంజాయ్ చేశారు. ఆడియన్స్ ఈ మూవీని బ్లాక్ బస్టర్ హిట్టు చేశారు.ఆ తరవాత విజయ్ దేవరకొండ తో లైగర్ చేశాడు. ఈ కాంబో పై ఆడియన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. స్టోరీ, పాటలు, డైలాగ్స్, స్క్రీన్ ప్లే వీటిలో ఏది కూడా ఆడియన్స్ ను మెప్పించలేక పోయింది. దారుణమైన వసూళ్ల తో పూరీ ని నష్టపరిచింది.
డిస్ట్రిబ్యూటర్లకు, పూరీ కి క్లాషెస్ కూడా వచ్చినట్టు వార్తలు వచ్చాయి. మళ్ళీ మునుపటి పరిస్థితి నే ఎదుర్కున్న పూరీకి తను కష్టాల్లో ఉన్నప్పుడు ఒడ్డున పడేసిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ నే నమ్ముకున్నాడు. కానీ ఈ సారి ఇది కూడా దారుణంగా నిరాశ పరిచింది. కానీ పూరీ మాత్రం తన ప్రయత్నాలను మాత్రం ఆపట్లేదు. హిట్టు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.
గోపిచంద్ తోనా.. రణబీర్ కపూర్ తోనా…
ఆ మధ్య గోపీచంద్ (Gopichand) తో మూవీ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. గోపీచంద్ కూడా చాలా కాలం నుండి హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు లేటెస్ట్ గా రణబీర్ కపూర్ (Ranbheer Kapur) తో మూవీ ప్లాన్ చేశారని ఫిలీం నగర్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. యానిమల్ మూవీతో రణబీర్ క్రేజ్ తెలుగులో కూడా పెరిగింది. అంతకుముందు బాలీవుడ్ కే పరిమితమైన తన క్రేజ్ ఒక్కసారిగా టాలీవుడ్ లో ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు.ఇప్పుడు పూరీ (Puri Jagannadh) రణబీర్ కాంబో సెట్ అయి మునుపటి పూరీ జగన్నాథ్ ల మూవీ పడితే మాత్రం రికార్డ్ లు గల్లంతే అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే…
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







