హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో పూరి జగన్నాథ్ ని (Puri Jagannadh)మించిన డైరెక్టర్ ఇంకొకరు లేరు అనేది ఇండస్ట్రీ టాక్. ఇడియట్, దేశముదురు, చిరుత,పోకిరి ఇలా ఎన్నో సినిమాల్లో హీరోను ఓ రేంజ్ లో చూపెడుతూ ఆడియన్స్ ఈలలు కొట్టేలా డైలాగులు రాసి హిట్లు కొట్టాడు.
అయితే కొంతకాలంగా పూరీకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఎన్టీఆర్ తో (NTR)చేసిన టెంపర్ మూవీ తర్వాత చాలా కాలం పాటు పూరీకి హిట్టు లేదు. ఫ్లాప్ ల్లో ఉన్న పూరీకి రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ మంచి జోష్ ను ఇచ్చింది.కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో లైగర్ , రామ్ తో డబుల్ ఇస్మార్ట్ మూవీస్ తో మళ్లీ సక్సెస్ ట్రాక్ తప్పాడు. ఈ మూవీస్ కి ప్రొడ్యూసర్ కూడా కావడంతో భారీగా నష్టపోయాడు. కానీ స్టార్ లతో సినిమాలను మాత్రం లైన్లో పెడుతూనే ఉన్నాడు.
Puri Jagannadh Movie : పూరీ గోపిచంద్ కాంబో..?
ప్రజెంట్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand)తో తన నెక్స్ట్ సినిమా తీస్తున్నాడని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. గోలీమార్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ గోపీచంద్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఆడియన్స్ ఈసారి పూరి హిట్టు కొట్టడం ఖాయమనే ఊహించుకుంటున్నారు. గోపీచంద్ గత సినిమాలు కూడా ఆశించిన విజయాలు అందుకోలేదు. శ్రీనువైట్ల దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన విశ్వం మూవీ కూడా తనను గట్టెకించలేకపోయింది.ఇప్పుడు పూరితో జత కడితే మాత్రం మరొకసారి సక్సెస్ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉండొచ్చు. వీరిద్దరికి కూడా ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. వీరి కాంబోపై రోజుకో న్యూస్ చక్కర్లు కొడుతుండగానే మరొక రూమర్ తెరపైకి వచ్చింది.
అఖిల్ తో మూవీ అప్పుడే..?
పూరి నాగార్జున తనయుడు అఖిల్ (Akhil) తో మూవీ తీయబోతున్నట్లు ఫిలింనగర్ టాక్ .అఖిల్ పూరి డైరెక్షన్లో ఒక మూవీ చేస్తే హీరోగా ఏ రేంజ్ లో ప్రెసెంట్ చేస్తాడో తెలిసిందే. కాబట్టి యాక్టర్ గా అఖిల్ మరొక షేడ్ చూపెట్టే ఛాన్స్ ఉంది. నాగార్జున కూడా పూరి జగన్నాథ్ తీసిన రెండు సినిమాల్లో డిఫరెంట్ గా కనిపిస్తాడు. శివమణి,సూపర్ మూవీలో కింగ్ నాగార్జునను పూరీ ఒక కొత్త స్టైల్ లో పరిచయం చేశాడు. ఇక అఖిల్ తో సినిమా తీస్తే డైలాగ్ డెలివరీ, లుక్ పూర్తిగా మారే అవకాశం అయితే ఉంది. అఖిల్ ప్రస్తుతం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తీసిన మురళీ కిషోర్ (Murali kishore)డైరెక్షన్లో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ సంవత్సరం మొత్తం ఆ మూవీ సెట్స్ పైనే ఉండే ఛాన్స్ ఉంది. వచ్చే ఇయర్ లో విడుదలకు సిద్ధం కానున్నట్లు సమాచారం. ఆ తర్వాత యువీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మూవీస్ అయిపోయాకనే పూరి (Puri Jagannadh Movie with akhil) అఖిల్ కాంబో పట్టాలకెక్కే చాన్స్ ఉన్నట్లు టాక్. అంతలో పూరి కూడా గోపీచంద్ తో చేయబోతున్న మూవీని కంప్లీట్ చేసి అఖిల్ స్క్రిప్ట్ పనుల్లో బిజీ అవుతారట . ఏదేమైనా వీరి కంబోపై వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Puri Jagannadh | పూరి అఖిల్ కాంబో నిజమేనా..?”