Sarkar Live

Raabinhud | రాబిన్ హుడ్ సినిమా మెప్పించిందా..?

Raabinhud Movie Review | నితిన్, శ్రీ లీల (Nitin, Sreeleela) హీరో హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటించిన మూవీ రాబిన్ హుడ్ (Raabinhud). ఈ మూవీకి భీష్మతో నితిన్ తో ఆల్రెడీ హిట్ కొట్టిన వెంకీ కుడుముల(venky

Raabinhud Movie Review

Raabinhud Movie Review | నితిన్, శ్రీ లీల (Nitin, Sreeleela) హీరో హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటించిన మూవీ రాబిన్ హుడ్ (Raabinhud). ఈ మూవీకి భీష్మతో నితిన్ తో ఆల్రెడీ హిట్ కొట్టిన వెంకీ కుడుముల(venky kudumula) దర్శకత్వం వహించారు. ఈ మధ్య వరుసగా నితిన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతుండగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…

Raabinhud Movie Story : స్టోరీ..

రామ్ ఒక అనాధాశ్రమంలో పెరుగుతాడు. పెద్దయ్యాక రాబిన్ హుడ్ పేరుతో దొంగతనాలు చేసి అనాధాశ్రమాలకు ఆ డబ్బులను పంచుతుంటాడు. తర్వాత దొంగతనాలు మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్స్ ను దగ్గర సెక్యూరిటీ ఏజెన్సీ లో జాయిన్ అవుతాడు. అమెరికాలో ఒక పెద్ద వ్యాపారవేత్త కూతురు నీరా తన వాళ్లను చూడడానికి ఇండియా వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రామ్ వెళ్తాడు. రుద్ర కొండ అనే ఊరిలో గంజాయి సాగు చేసే సామీ మీరాను కిడ్నాప్ చేస్తాడు.. అసలు గంజాయి సాగు చేసే విలన్ కి నీరాకు ఏంటి సంబంధం… దొంగగా ఉన్న రాబిన్ హుడ్ ఎందుకు సెక్యూరిటీ ఏజెన్సీలో చేరాల్సి వచ్చింది. రుద్రకొండ గ్రామానికి వీరికి ఏంటి సంబంధం.. అనేది మూవీ..

మూవీ ఎలా ఉందంటే..

హీరో దొంగతనాలు చేసి భారీగా విరాళాలు ఇవ్వడం.. లేకపోతే పేదలకు పంచడం.. లేదా ప్రజల కోసం ఏదో ఒక మంచి పని చేయడం అనేది ఎప్పటినుండో వింటున్న కథ. కాకపోతే ట్రీట్మెంట్ అనేది కొత్తగా ఉంటుంది. ఈ మూవీలో కూడా కథ పాతదే అయిన ట్రీట్మెంట్ కాస్త కొత్తగానే ఉందనిపించింది. ఫస్ట్ ఆఫ్ మొత్తం కామెడీ వే లోనే డైరెక్టర్ ప్రజెంట్ చేశారు. రామ్ ను అనాధాశ్రమంలో ఎవరు చేర్పించారు. పెద్దయ్యాక అతడు దొంగగా ఎందుకు మారాడు. దొంగతనాలు చేస్తుంటే ఎంత చాకచక్యంగా పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. డబ్బులను అనాధాశ్రమాలకు విరాళాలు ఇవ్వడం ఇలాంటివి చూపెడుతూ ఫన్ మాత్రం చాలా బాగా జనరేట్ చేశాడనిపించింది. సెకండ్ ఆఫ్ మరీ రొటీన్ గా నే మూవీ నడిచింది అనిపించింది. అక్కడక్కడ ట్విస్టులు ఉన్నప్పటికీ మరి అంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు అనిపించదు.సాగదీత సీన్లతో ప్రేక్షకుడు కొద్దిగా అసహనానికి గురవుతారు. క్లైమాక్స్ కూడా మరి అంతగా అనిపించదు. ఓవరాల్ గా మూవీని తీసుకుంటే అక్కడక్కడ కామెడీ సీన్లు, కొన్ని ఫైట్లు అక్కడక్కడ ట్విస్టులతో అలా సాగిపోతుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..

హీరో నితిన్ రామ్, రాబిన్ హుడ్ గా చాలా బాగా నటించారు. నితిన్ ఫన్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ శ్రీలీల ఈ మూవీలో చాలా అందంగా కనిపించింది. సాంగ్స్ లో కూడా అదరగొట్టే సింది. తన వరకు స్క్రీన్ ప్రజెన్స్ తో మెప్పించింది. ఇక రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ల కామెడీ సూపర్ గా వర్క్ అవుట్ అయింది. షైన్ చాం టాకో మిగిలిన నటీ నటులు బాగానే నటించారు.
ఈ మూవీలో జీవి ప్రకాష్ కుమార్ (Jeevi Prakash Kumar) అందించిన నేపథ్య సంగీతం మూవీ సీన్స్ ని ఏలివేట్ చేశాయి. పాటలు మాత్రం బాగానే ఉన్నా వాటిని సరిగా తెరకెక్కించలేదనిపించింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగుంది. మైత్రి మూవీ మేకర్స్ లాంటి బిగ్ బ్యానర్ లో వచ్చిన మూవీ కాబట్టి ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించారు. అంతే రీచ్ గా మూవీ కనబడుతుంది. ఓవరాల్ గా ఈ మూవీ జస్ట్ ఒకే అనిపించింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!