టాలీవుడ్ లో అదిరిపోయే కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. అందులో ఒక సెన్సేషనల్ కాంబో సెట్ అయినట్టు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ (Ramcharan-Prashant Neel Combo) ఓ మూవీ చేయబోతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినబడుతున్నాయి.
ప్రజెంట్ రాంచరణ్ పెద్ది ( Peddhi)మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు (Bucchi babu) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. రాంచరణ్ లుక్ రిలీజ్ చేయగా రగ్గడ్ లుక్ లో అదిరిపోయేలా ఉన్నారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతున్న ఈ మూవీపై ఆడియన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు.
పెద్ది తర్వాత లైన్ లో సుక్కు…?
ఇటీవల మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న కన్నడ హీరో శివ రాజ్ కుమార్ (Shivaraj kumar)లుక్ ను కూడా రిలీజ్ చేసింది మూవీ టీం. రామ్ చరణ్ కి గురువు గా నటించనున్నట్టు తెలుస్తోంది. మార్చి 27 న (March 27) రిలీజ్ అవుతుందని మూవీ టీం ముందే అనౌన్స్ కూడా చేసింది. ఇదిలా ఉండగా నెక్స్ట్ చరణ్ ను డైరెక్ట్ చేయడానికి సుకుమార్ లైన్ లో ఉన్నాడు. స్క్రిప్ట్ వర్క్ లో బిజీ బిజీగా ఉన్నారు సుక్కు.
వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. దానికి మించి భారీ స్కేల్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారట. బుచ్చిబాబు సినిమా అయిన వెంటనే కొబ్బరికాయ కొట్టాలని చూస్తున్నారు. అయితే ఫిలిం నగర్ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో జత కట్టనున్నట్టు టాక్ వినబడుతుంది.
ప్రభాస్, అల్లు సినిమాల తర్వాతే..?
Ramcharan-Prashant Neel Movie update : ఎన్టీఆర్ తో తీస్తున్న డ్రాగన్ మూవీ సెట్స్ పై ఉంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ తో సలార్ 2 , అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రశాంత్ నీల్ ఆ మూవీస్ కంప్లీట్ చేయాలంటే ఎంత లేదన్న 3 ఇయర్స్ పైనే పడుతుంది. ఇటు చరణ్ పెద్ది సినిమాను మార్చిలో రిలీజ్ పెట్టుకున్నారు.. కాబట్టి ఇంకో రెండు మూడు నెలల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. వెంటనే సుక్కు మూవీ పట్టాలకెక్కిస్తారు. ఆయన మూవీ అంటే సంవత్సరం పైనే పడుతుంది. ఎవరి ప్రాజెక్ట్స్ వారు ఫినిష్ చేసుకుని కలుస్తారని తెలుస్తోంది. ఇంకా స్టోరీ ఫైనల్ కాలేదని, కొన్ని డిస్కషన్స్ అయ్యాక లాక్ చేస్తారని టాక్. ఈ సెన్సేషనల్ కాంబోలో మూవీ పడిందంటే బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయమని ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. కొద్ది రోజుల్లోనే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







