Sarkar Live

Ravi Teja | థ్రిల్లర్ మూవీ లో మాస్ మహారాజా…?

మాస్ మహారాజా రవితేజ (mass Maharaja Ravi Teja)హిట్టు ప్లాప్ లతో తేడా లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు.మెగాస్టార్ చిరు (Megastar Chiranjeevi)తో యాక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య(vaalteru veerayya) మూవీ హిట్ తరవాత ఇంకో హిట్టు

Ravi Teja

మాస్ మహారాజా రవితేజ (mass Maharaja Ravi Teja)హిట్టు ప్లాప్ లతో తేడా లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు.మెగాస్టార్ చిరు (Megastar Chiranjeevi)తో యాక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య(vaalteru veerayya) మూవీ హిట్ తరవాత ఇంకో హిట్టు కొట్టలేదు. ఆ మూవీ లో చిరు మెయిన్ రోల్ కాబట్టి ఆ హిట్టు రవితేజది ఒక్కడిదే కాదు. సోలో గా త్రినాథ రావు నక్కిన (Trinath Rao nakkina)డైరెక్షన్ లో వచ్చిన ధమాకా (dhamaka)తో లాస్ట్ హిట్టు కొట్టాడు.

ఆ తర్వాత రావణసుర, టైగర్ నాగేశ్వర్ రావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు ఒకదానికి మించి మరొకటి వరుస ఫ్లాఫ్ లు అయ్యాయి.ప్రజెంట్ భాను బోగవరపు డైరెక్షన్ లో మాస్ జాతర(mass jathara) మూవీ సెట్స్ పై ఉంది. దాదాపు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

ధమాకా లాంటి సూపర్ హిట్టు మూవీ తరవాత శ్రీలీల, రవితేజ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ తో ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడనే నమ్మకంతో మాస్ మహారాజా ఉన్నారట. ఆ మధ్య మూవీ టీం సాంగ్స్ ని కూడా రిలీజ్ చేసింది. ఏఐ సాయంతో చక్రి వాయిస్ ను రీ క్రియేట్ చేసిన సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.త్వరలోనే మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

శివ నిర్వాణ డైరెక్షన్ లో…

అయితే రవితేజ ఆల్రెడీ కిషోర్ తిరుమల(Kishore tirumala)మూవీకి ఒకే చెప్పాడు.ఈ రెండు సినిమాలు ఉండగానే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి ఒకే చెప్పినట్టుగా తెలుస్తోంది. నిన్నుకోరి, మజిలీ,ఖుషీ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తీసిన శివ నిర్వాణ (Shiva nirvana) డైరెక్షన్ లో ఓ మూవీ చేయబోతున్నారట. ఇటీవలే స్టోరీని మాస్ మహారాజా కి చెప్పగా ఆయన లాక్ చేసినట్టు తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో Ravi Teja

శివ నిర్వాణ ఇప్పటివరకు లవ్ స్టోరీస్ తీయగా రవితేజ (Ravi Teja) తో మాత్రం థ్రిల్లర్ మూవీని తీస్తున్నారట. ఈ మూవీని టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ (maitri movie makers)ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు ఫిలిం నగర్ లో టాక్ వినబడుతుంది. ఆల్రెడీ సెట్స్ పై ఉన్న మాస్ జాతర మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ ను కూడా త్వరలోనే పెంచుతారు.వెంటనే రవితేజ కిషోర్ తిరుమల మూవీకి షిఫ్ట్ అవుతారు. ఆ మూవీ కంప్లీట్ అయ్యేవరకు ఆ మూవీ పైనే ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ జరుగుతుండగానే శివ నిర్వాణ మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది.ఈ మూవీ పై అధికారిక అనౌన్స్మెంట్ తొందరలోనే చేయనున్నారట. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఈ మూవీ రవితేజ కి ఒకే అయితే డిఫరెంట్ జోనర్ లో రవితేజను చూడవచ్చని ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?