మొదటి నుండి మాస్ మహారాజా రవితేజ(Mass Maharaja Raviteja)స్టైలే వేరే. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటాడు. సినిమా హిట్టు అయినా, ఫ్లాప్ అయినా ఆ రిజల్ట్ పట్టించుకోకుండా మరో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్తుంటాడు. ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత రవితేజ కి ఆ రేంజ్ లో ఒక్క హిట్టు కూడా పడలేదు.రీసెంట్ గా తన 75 వ మూవీని బాను బోగవరపు (Bhanu bogavarapu)డైరెక్షన్ లో చేశారు. ఎన్నో అంచనాలతో రవితేజ వరుస ఫ్లాప్ లకు బ్రేక్ వేస్తుందనుకున్న ఈ మూవీ ఆడియన్స్ ఆదరించలేదు.రవితేజ కెరీర్ లో మరో ఫ్లాప్ మూవీగా నిలిచిపోయింది.
సెట్స్ పై కిషోర్ తిరుమల మూవీ..
ఈ మూవీ రిలీజ్ కాకముందే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే కిషోర్ తిరుమల (kishore thirumala)డైరెక్షన్ లో భర్త మహాశయులకు విజ్ఞప్తి (bhartha mahashayulaki vignpthi)అనే మూవీ ని అనౌన్స్ చేశాడు.ఆల్రెడీ సెట్స్ పై ఉన్న ఈ మూవీ నుండి ఆ మధ్య ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ చూసిన రవితేజ ఫ్యాన్స్, మూవీ లవర్స్ నుండి ఈ సారి పక్కా హిట్టు కొట్టబోతున్నాడనే పాజిటివ్ టాక్ కూడా వినబడింది. ఈ మూవీ తర్వాత రవితేజ క్లాస్ డైరెక్టర్ శివ నిర్వాణ(shiva nirvana) డైరెక్షన్ లో ఒక మూవీ చేయబోతున్నాడు.
ఈ జానర్ రవితేజ కి హిట్టు ఇస్తుందా..?
నిన్ను కోరి, మజిలీ, ఖుషీ లాంటి మూవీస్ తో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సారి రవితేజ తో ఏ మూవీ చేయబోతున్నాడని క్యూరియా సిటీ ఆడియన్స్ లో ఉంది.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూవీ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. శివ నిర్వాణ ఫస్ట్ టైమ్ అటెంప్ట్ చేయబోతున్న ఈ జానర్ రవితేజ కి హిట్టు ఇస్తుందో లేదో చూడాలి.అలాగే రవితేజ ఇంతవరకు తీసిన మూవీస్ లో కొత్తగా ప్రయోగం చేసిన మూవీస్ ని ఆడియన్స్ ఆదరించకపోవడంతో రవితేజ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే వరుస ఫ్లాప్ లు అవుతుంటే ఈ ప్రయోగాలు అవసరమా అని అనుకుంటున్నారు.
ఆఖరి వారంలో అనౌన్స్మెంట్…?
శివ నిర్వాణ తనకు హిట్స్ వచ్చిన జానర్ లోనే మూవీ తీస్తే రవితేజకి హిట్టు పడే ఛాన్స్ ఉందని చర్చించుకుంటున్నారు. వింటేజ్ మాస్ మహారాజా రవితేజ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అది దృష్టిలో పెట్టుకుని రవితేజ ఫ్యాన్స్ ను అలరించే మూవీ తీస్తాడో లేదో చూడాలి. నవంబర్ ఆఖరి వారంలో శివ నిర్వాణ, రవితేజ కాంబో లో మూవీని అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారట.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







