RBI slashed interest rate : ఆర్‌బీఐ (RBI) ఓ శుభవార్త చెప్పింది. వడ్డీ రేటును మరోసారి తగ్గిస్తున్నట్టు (RBI slashed key interest rate) వెల్లడించింది. ఆర్‌బీఐ ఇలా నిర్ణయం తీసుకోవడం ఇది వరుసగా రెండోసారి. ఈసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, రిపో రేటును 6 శాతానికి తీసుకొచ్చింది. దీంతో హోం లోన్, వాహన లోన్, కార్పొరేట్ లోన్లపై వడ్డీ తక్కువ అవుతుంది.
వడ్డీ రేటు అంటే ఏమిటి?
వడ్డీ రేటు అనేది RBI ద్వారా బ్యాంకులకు ఇచ్చే అప్పుపై విధించే వడ్డీ. దీన్ని ‘రిపో రేట్’ అని పిలుస్తారు. బ్యాంకులు ఈ వడ్డీ రేటుతో RBI నుంచి డబ్బులు అప్పు తీసుకుంటాయి. రిపో రేట్ (Repo rate) తగ్గితే బ్యాంకులు తక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటాయి. దీంతో ఈ బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే లోన్లపై కూడా వడ్డీ తగ్గించే అవకాశం ఉంటుంది.
దీనిపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra )మాట్లాడుతూ ‘మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకుంది. దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వృద్ధికి తోడ్పడేలా వడ్డీ రేటు తగ్గించడం అవసరమని భావించాం’ అని అన్నారు.
RBI slashed interest rate : ఎందుకు కీలకం?
ఆర్‌బీఐ (RBI) తీసుకున్న నిర్ణయం ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చాలా కీలకమైనదని అంటున్నారు విశ్లేషకులు. ఇటీవల భారత దిగుమతులపై అమెరికా ( US) భారీగా రికిప్రోకల్ టారిఫ్‌లు విధించింది. దీంతో భారత్‌కు వ్యాపారంగా నష్టాలు రావచ్చు. తద్వారా దేశ ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేటు (RBI interest rate)ను తగ్గించడం విశేషమని అంటున్నారు. ఇది అప్పులు తీసుకునే కస్టమర్లకు తక్కువ వడ్డీకి లోన్లు అందించడానికి మార్గం కల్పిస్తుంది. అలాగే వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహపడతాయి.
సామాన్య ప్రజలకు ఉపయోగం ఏమిటి?
వడ్డీ రేటు తగ్గితే బ్యాంకులు తమ కస్టమర్లకు తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తాయి. ముఖ్యంగా హోం లోన్, ఆటో లోన్, విద్యా లోన్ తీసుకునే వారికి ఇదెంతో మేలు. రూ.30 లక్షల హోం లోన్ తీసుకున్న వారికి వడ్డీ రేటు 0.25 శాతం తగ్గుతుంది. నెలకు రూ.400-600 వరకు EMI తగ్గుతుంది. వాహన లోన్ తీసుకునేవారికి వడ్డీ తక్కువగా ఉండటం వల్ల చెల్లించే మొత్తం తక్కువ అవుతుంది. వ్యాపార లోన్లు కూడా తక్కువ వడ్డీకి దొరుకుతాయి.
RBI : సద్వినియోగం చేసుకుంటేనే మేలు
ఆర్‌బీఐ (RBI) ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరట లభించనుంది. అప్పులు తీసుకునే వారికి భారం తగ్గుతుంది. అయితే.. దీన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మేలు అని అంటున్నారు ఆర్థిక నిపుణులు. మున్ముందు RBI ఇంకా వడ్డీ రేటును తగ్గిస్తుందా.. లేదా? అన్నది అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.