- రంగురంగుల బ్రోచర్ల మాయలో పడిపోతున్న తల్లిదండ్రులు
- జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఏం చేస్తోంది?
Education Scam in Hanmakonda | ఆకర్షణీయమైన యాడ్ లు, నగరంలో పెద్ద పెద్ద హోర్డింగ్ లు, తల్లిదండ్రులను బురిడీ కొట్టించే బ్రోచర్ లు, మాయమాటలతో కనికట్టు చేసే పిఆర్వోలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కార్పొరేట్ కాలేజీగా ప్రచారం చేసుకోవడంలో రెజోనెన్సు కళాశాల యాజమాన్యం జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి వుంది. పెద్ద ఎత్తున అడ్మిషన్లనే టార్గెట్ గా పెట్టుకున్న సదరు కళాశాల యాజమాన్యం.. ఎక్కడ ఖాళీ బిల్డింగ్ దొరికితే చాలు అక్కడ బ్రాంచీలు ఓపెన్ చేసి తమ విద్యా వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆ కాలేజీ కి అనుమతులు ఎన్ని? వారు నిర్వహిస్తున్న బ్రాంచీలు ఎన్ని ? అనే విషయం ఇప్పుడు ఇటు విద్యాశాఖతో పాటు అటు హన్మకొండ నగరంలో చర్చనీయాంశంగా మారింది.
అనుమతి ఉన్నది 4 .. నడుపుతున్నవి 9 బ్రాంచీలు?
హన్మకొండ జిల్లా (Hanmkonda District)లో కార్పొరేట్ విద్యనందిస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రెజోనెన్సు కళాశాల (Resonance College) యాజమాన్యం.. విద్యాశాఖ నుంచి అనుమతి లేకుండానే విచ్చలవిడిగా బ్రాంచీలను ఓపెన్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. విద్యాశాఖ నుంచి 4 బ్రాంచీలకే అనుమతి తీసుకున్న సదరు యాజమాన్యం అనుమతి లేకుండా మరో 5 బ్రాంచీలను నగరంలో ఏర్పాటు చేసి నగరంలో తన హవాను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అనుమతి లేకున్నా (Education Scam ) నగరంలో తమ ఇష్టానుసారంగా 5 బ్రాంచీలు ఏర్పాటు చేసి కళాశాలలు (Intermediate College) నిర్వహిస్తున్నప్పటికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ (Education Department) కు అనుమతి లేని రెజోనెన్సు కాలేజీలు ఎందుకు కనపడట్లేదో అర్ధంకాని పరిస్థితి.హన్మకొండ నగరంలో అనుమతి లేకుండా రెజోనెన్సు యాజమాన్యం 5 బ్రాంచీలు నిర్వహిస్తున్న విషయం అసలు డిఐఈఓ దృష్టిలో ఉందా? లేదా ?ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
📍 అనుమతి ఉన్నవి…
- H. NO:1-7-1099అడ్వకేట్స్ కాలనీ, బాలసముద్రం code:38323
- H. NO:5-8-190/A కిషన్ పుర, లష్కర్ బజార్ code:38273
- H. NO:1-7-1111/A ఏకశిలా పార్క్, అడ్వకేట్స్ కాలనీ బాలసముద్రం
❌ అనుమతి లేనివి…
- హంటర్ రోడ్ లో ఉన్న కాకతీయ కాలేజ్ ఆఫ్ ఫిజియోతెరపి బిల్డింగ్ లో ఉన్న బ్రాంచి
- హంటర్ రోడ్ లో ఉన్న ఎంజీ మోటార్స్(కార్ షోరూమ్) పక్క వీధిలో ఉన్న బ్రాంచి
- పోలీస్ హెడ్ క్వార్టర్స్ వెనకాల ఉన్న బ్రాంచి
- హంటర్ రోడ్ శ్రీరామ హిల్స్ రోడ్ నెంబర్ 4 లో ఉన్న బ్రాంచి
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.