Sarkar Live

ప్రపంచ రికార్డు బద్దలు: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ.. అఫ్రిదిని వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర! – Rohit Sharma World Record

Rohit Sharma World Record | టీమిండియా మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన రోహిత్, అంతర్జాతీయ

Rohit Sharma

Rohit Sharma World Record | టీమిండియా మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన రోహిత్, అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ ఈ ఘనత సాధించడానికి కేవలం మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను సమర్థంతంగా ఎదుర్కొన్న రోహిత్, కీలకమైన మూడు సిక్సర్లు బాది.. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది రికార్డును అధిగమించాడు. అఫ్రిది తన కెరీర్‌లో 351 సిక్సర్లు కొట్టగా, రోహిత్ శర్మ ఇప్పుడు 352 సిక్సర్లతో అతన్ని వెనక్కి నెట్టాడు.

మ్యాచ్‌లో మెరుపు ప్రదర్శన

రాంచీలో జరిగిన ఈ వన్డేలో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటన నుంచి కొనసాగిస్తున్న అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో స్వల్ప ప్రమాదం నుంచి బయటపడిన హిట్‌మ్యాన్, దాన్ని సద్వినియోగం చేసుకుని హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ శర్మ 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 57 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు కేవలం 109 బంతుల్లోనే 136 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించి జట్టుకు పటిష్టమైన పునాది వేశాడు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?