- క్లోజ్ ఫైల్స్ భద్రమేనా?
- సీనియర్ అసిస్టెంట్ అప్రూవ్ చేసిన ఫైల్స్ ను విజిలెన్స్ విచారిస్తే విస్తుపోవాల్సిందే?
- లంచాల లావాదేవీలు “ప్రశాంతంగా” జరిగేందుకు ప్రైవేట్ వ్యక్తిని నియమించుకున్నట్లు ఆరోపణలు ?
Bhupalapalli RTA : రవాణా శాఖలో “సాయి” లీలలు మామూలుగా ఉండటంలేదట, కారుణ్య నియామకంతో విధుల్లో చేరిన సదరు ఉద్యోగి అనతికాలంలోనే ఆర్టీఏ (RTA ) లో కాస్ట్లీ ఉద్యోగిగా మారినట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సదరు ఈ సీనియర్ అసిస్టెంట్ ఆర్టీఏ నిబంధనలను భేఖాతరు చేస్తూ అనేక ఫైళ్లను అప్రూవ్ చేసినట్లు తెలుస్తోంది. వరంగల్ కార్యాలయం లో విధులు నిర్వహించిన సదరు ఉద్యోగి బదిలీపై ఆ జిల్లా కార్యాలయానికి వెళ్లడంతోనే అనేక అక్రమాలకు పాల్పడినట్లు అందినకాడికి దండుకున్నట్లు సమాచారం. ప్రతి పనికి ఓ రేటు తీసుకునే సదరు సీనియర్ అసిస్టెంట్ తన లంచాల లావాదేవీలు “ప్రశాంతంగా” జరిగేందుకు ఓప్రైవేట్ వ్యక్తిని నియమించుకొని గట్టిగానే మామూళ్లు గుంజుతున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
సదరు సీనియర్ అసిస్టెంట్ అప్రూవ్ చేసిన ఫైల్స్ లో సగానికి పైగా క్లోజ్ ఫైల్స్ కార్యాలయంలో ఉండవని, విజిలెన్స్ అధికారులు కనుక ఆ ఉద్యోగి అప్రూవల్ చేసిన ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తే అతగాడి బండారం బయటపడుతుందని కార్యాలయంలో సైతం గుసగుసలు వినిపించడం గమనార్హం. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా అంతర్ జిల్లాలకు వాహనాలను బదిలిచేయడంలో సదరు ఉద్యోగి దిట్ట అని తెలిసింది. ఆర్సీ, ఎన్ ఓ సి తదితర సర్టిఫికేట్ లు లేకుండానే వందలాది వాహనాలకు పేరు మార్పిడి (ఓనర్ షిప్) చేసినట్లు సమాచారం. ఇంకో విషయం ఏమిటంటే అసలు వాహన యజమానులకు తెలియకుండానే మరొకరిపైకి వారి వాహనాలను ట్రాన్స్ఫర్ చేయడంలో ఈ సీనియర్ అసిస్టెంట్ నిష్ణాతుడని ఉమ్మడి జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రచారం జరగడం గమనార్హం. మరి ఈ ఆరోపణలపై రవాణా శాఖ ఉప కమిషనర్(డిటిసి) స్పందించి సదరు ఉద్యోగి ఆ కార్యాలయానికి వచ్చిన నాటినుండి అప్రూవల్ చేసిన ఫైల్స్(క్లోజ్ ఫైల్స్)ను పరిశీలిస్తారా?లేదా అనేది చూడాల్సిందే.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







