Sarkar Live

Sikindhar | సికిందర్ ట్రైలర్ ఎలా ఉందంటే.. ?

సల్మాన్ ఖాన్ (Salman Khan) లేటెస్ట్ మూవీ సికిందర్ (Sikindhar) ట్రైలర్ వచ్చేసింది. రష్మిక మందన(rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏఆర్ మురుగదాస్ (AR Murugadas) డైరెక్ట్ చేశాడు. గతంలో అమీర్ ఖాన్ హీరోగా గజినీ మూవీని

Sikindar

సల్మాన్ ఖాన్ (Salman Khan) లేటెస్ట్ మూవీ సికిందర్ (Sikindhar) ట్రైలర్ వచ్చేసింది. రష్మిక మందన(rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏఆర్ మురుగదాస్ (AR Murugadas) డైరెక్ట్ చేశాడు. గతంలో అమీర్ ఖాన్ హీరోగా గజినీ మూవీని తీసి సూపర్ హిట్టు అందుకున్నాడు. చాలా కాలం తర్వాత మళ్లీ మరో హిందీ సూపర్ స్టార్ తో సికిందర్ మూవీ తెరకెక్కించాడు.

Sikindhar ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్..

లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూస్తుంటే మురుగదాస్ ఇదొక యాక్షన్ డ్రామాగా మలిచినట్లు తెలుస్తోంది. మురుగదాస్ సినిమాలు అంటేనే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ ఉంది. మురగదాస్ తన ప్రతీ మూవీలో ఎమోషన్స్ కి పెద్ద పీట వేస్తాడు.ఏదో ఒక బలమైన సందేశమో, సమస్య నో చూపెట్టి హిట్టు కొడుతుంటాడు.

ఈ మూవీలో కూడా హీరో జనాల కోసం పోరాడే పాత్రలో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్ లో ఐదు సంవత్సరాలలో 49 కేసులు ఉన్నాయని ఒక వాయిస్ చెబుతుండగా సల్మాన్ ఖాన్ ఫోటోని జైలులో నేరస్తుల ఫోటోల మధ్యలో పెడతారు. దీన్ని చూస్తుంటే పోలీసులు హీరోని వెతుకుతున్నట్టుగా అనిపిస్తుంది.జనాలకి అన్యాయం చేసే వారిపై పోరాడే ఒక శక్తివతమైన పాత్రలో సల్మాన్ ఖాన్ అదరగొట్టినట్టు తెలుస్తోంది.

మార్చి 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్..

రష్మిక మందన ఒక డైలాగ్ చెప్తూ సల్మాన్ ఖాన్ ని ప్రజలు రకరకాలుగా పిలుస్తారని అందులో సికిందర్ అనే పేరు కూడా పిలుస్తారని చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే ప్రజల సమస్యలను తీర్చే నాయకుడిగా ఎదిగి సికిందర్ గా అందరితో కీర్తించబడుతాడని అర్థమవుతుంది. ట్రైలర్లో ఎమోషన్స్ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యేటట్లుగా ఉంది. సల్మాన్ ఖాన్ యాక్షన్ కామెడీ ఎమోషన్స్ లో ఎలా అభినయిస్తాడో మనకు తెలిసిందే. ఈ మూవీతో మరొకసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడని అనిపిస్తుంది. హీరోయిన్ రష్మిక మందన్నది కూడా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప -2, చావా మూవీలతో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లు అందుకున్న రష్మిక సికిందర్ మూవీ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం కాయంగా కనిపిస్తుంది. సాజిద్ నడియడ్ వాలా నిర్మిస్తున్న ఈ మూవీ మార్చి 30 న వర్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!