Sarkar Live

Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర ప్ర‌మాదం- 43 మంది మృతి

మృతుల్లో 10 మంది హైద‌రాబాదీలు Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలకు విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌కు చెందిన సుమారు 10 మంది (Hyderabad residents killed) మరణించారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఒప్పంద

Saudi highway crash

మృతుల్లో 10 మంది హైద‌రాబాదీలు

Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలకు విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌కు చెందిన సుమారు 10 మంది (Hyderabad residents killed) మరణించారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఒప్పంద పనుల కోసం, లేదా వ్యక్తిగత అవసరాల కోసం వెళ్లిన హైదరాబాద్‌ వాసులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవ‌డంతో వారి కుటుంబాలు కన్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నాయి.

సౌదీ రోడ్లపై ట్రాఫిక్ తీవ్రంగా ఉండటం, అంతర్రాష్ట్రాల మధ్య ప్రయాణించే బస్సులు ఎక్కువ వేగంతో నడపడం వంటివి ప్రమాదాలకు దారితీస్తాయి. ఈ ఘటన కూడా అలాంటి వేగం లేదా సాంకేతిక లోపం వల్ల జరిగిందా? అనే విషయంపై అక్కడి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బస్సు పూర్తిగా ధ్వంసమైపోవడంతో రక్షణ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం.

Saudi highway crash : మృతుల కుటుంబాల్లో ఆందోళన

సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన‌, తీవ్రంగా గాయ‌ప‌డిన వారి కుటుంబాలు అక్క‌డి స‌మాచారం కోసం ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టింది. వివరాలు తెలుసుకోవడానికి రెండు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు (Helpline numbers Saudi accident) 79979 59754, 99129 19545 ఏర్పాటు చేసింది. వీటికి ఎవరు కాల్ చేసినా ప్రమాదానికి సంబంధించిన తాజా సమాచారాన్ని, మృతుల వివరాలను, గాయపడిన వారి పరిస్థితిని, అవసరమైన సహాయాన్ని సంబంధిత అధికారులు అందిస్తారని సీఎస్ కార్యాల‌యం సూచించారు. ఈ నంబర్ల ద్వారా కుటుంబాలు ప్రత్యక్షంగా ప్రభుత్వంతో మాట్లాడి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.

సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని (CM Revanth Reddy reaction) వ్యక్తం చేశారు. విదేశాల్లో తెలంగాణ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం వారి వెంట ఉంటుందని భ‌రోసా ఇచ్చారు. సహాయం అందించడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో సీఎం ఆదేశాల మేరకు సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియా అధికారులు, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్‌తో నిరంతరం సంప్రదిస్తూ తాజా వివరాలు సేకరిస్తున్నారు.

సీఎస్‌ ప్రత్యక్షంగా సమన్వయం

తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్య కార్యదర్శి (CS) వ్యక్తిగతంగా ఈ ఘటనపై పర్యవేక్షణ చేస్తున్నారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌తో పాటు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ (MEA) ఉన్నతాధికారులతో కూడా ఆయన మాట్లాడారు. భారత దౌత్య కార్యాలయం ద్వారా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది గంటల్లో అందుతాయని, మృతుల గుర్తింపు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని ఆయ‌న తెలిపారు. సౌదీలో ఉన్న ఇతర తెలంగాణ ప్రజలు కూడా భయపడకుండా హెల్ప్‌లైన్‌ నంబర్లను సంప్రదించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో భారత రాయబారి కార్యాలయం కూడా పూర్తిస్థాయిలో సహాయం అందిస్తుందని అధికారులు చెబుతున్నారు.

Saudi highway crash : ప్రమాదం ఎలా జరిగింది?

ప్రాథ‌మిక‌ సమాచారం ప్రకారం.. ఓ బస్సులో భారతీయులు, ఇతర దేశాలకు చెందిన కార్మికులు ఎక్కారు. హైవేపై బ‌స్సు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా అదుపు తప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎక్కువ సంఖ్య‌లో ఉండటం వల్ల ప్రాణనష్టం భారీగా జరిగింది. రక్షణ బృందాలు చాలా కష్టపడి మృత‌దేహాల‌ను బయటకు తీశారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?