Sarkar Live

Loans | మ‌హిళ‌ల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌

3.5 లక్షల మహిళా సంఘాల‌కు రేపు ₹304 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీ Interest Free Loans in Telangana | రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు పెద్ద శుభవార్త. మొత్తం 3.50 లక్షల SHG మహిళలకు ₹304

Interest Free Loans

3.5 లక్షల మహిళా సంఘాల‌కు రేపు ₹304 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీ

Interest Free Loans in Telangana | రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు పెద్ద శుభవార్త. మొత్తం 3.50 లక్షల SHG మహిళలకు ₹304 కోట్ల వడ్డీలేని రుణాలను (Interest Free Loans) నవంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, CS రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ములుగు జిల్లా నుంచి పంచాయతీరాజ్ మరియు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

ఈసంద‌ర్భంగా ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ మాట్లాడుతూ.. నవంబర్ 25 ఉదయం 11 గంటలకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా రుణాలను పంపిణీ చేస్తామని తెలిపారు. మొత్తాలు నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని, పారదర్శకత కోసం ప్రతి సభ్యురాలికి వివరాలు తెలియజేయాలని సూచించారు. ఈ రుణాలు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచుతున్నాయని ఆయ‌న పేర్కొన్నారు.

ఇందిరమ్మ చీరల పంపిణీ వేగవంతం

రాష్ట్రంలో జరుగుతున్న ఇందిరమ్మ చీరల పంపిణీ పట్ల మహిళలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నాణ్యత, డిజైన్ల పట్ల వచ్చిన ప్రశంసలను కూడా అధికారులకు వివరించారు.
కాగా నాణ్యమైన ఇందిరమ్మ చీరల పంపిణీపై సంతోషం వ్యక్తం చేస్తున్న మహిళల తరఫున మంత్రి సీత‌క్క‌ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తుండటం మహిళా సాధికారతకు పెద్ద బలమని అన్నారు.

CS రామకృష్ణారావు సూచనలు

జిల్లాల్లో చీరల పంపిణీ వేగంగా జరుగుతున్నందుకు కలెక్టర్లను సీస్ రామ‌కృష్ణారావు అభినందించారు. రుణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను తప్పనిసరిగా ఆహ్వానించాలని సూచించారు. రాష్ట్రంలో 1 లక్ష మంది విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు కూడా విడుదల చేసినట్లు తెలిపారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?