Sarkar Live

అక్టోబర్ 17న ‘తెలుసు కదా’ – Siddhu jonnalagadda

గుండెజారి గల్లంతయిందే (Gunde Jaari Gallanthayyinde) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమై హీరో నితిన్ (Nitin)కి స్టైలిస్ట్ గా పనిచేసిన నీరజ కోన (Neeraja Kona) డైరెక్టర్ గా తీసిన ఫస్ట్ మూవీ తెలుసు కదా (Telusu kada). డీజే టిల్లు, టిల్లు

Siddhu jonnalagadda

గుండెజారి గల్లంతయిందే (Gunde Jaari Gallanthayyinde) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమై హీరో నితిన్ (Nitin)కి స్టైలిస్ట్ గా పనిచేసిన నీరజ కోన (Neeraja Kona) డైరెక్టర్ గా తీసిన ఫస్ట్ మూవీ తెలుసు కదా (Telusu kada). డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ (DJ Tillu, Tillu Square) మూవీలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సిద్దు జొన్నలగడ్డ (Siddhu jonnalagadda) హీరోగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి (Rashi Kanna, Srinidhi shetti) హీరోయిన్ లుగా యాక్ట్ చేస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

ఇద్దరు భామలతో Siddhu jonnalagadda..

దీపావళి సందర్భంగా అక్టోబర్ 17 (October 17) న రిలీజ్ చేయబోతున్నట్టు ఒక స్పెషల్ వీడియోను హీరో, హీరోయిన్ లతో చేసి ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. వీడియో చూస్తుంటే ఈ మూవీ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కినట్టు అర్థమవుతుంది. ఒకరికి తెలియకుండా ఇంకొకరితో ప్రేమాయణం నడిపే పాత్రలో సిద్ధూ నటించినట్లు తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ మూవీలో ఫ్రెండ్స్ అని వారిని హీరో ఒకరికి తెలియకుండా ఇంకొకరితో లవ్ లో ఉంటాడని తెలుస్తోంది. ఆఖరికి ఇది ఎటు మలుపు తిరుగుతుందో తెరపై డైరెక్టర్ ఆసక్తికరంగా చూపించబోతున్నట్టు అర్థమవుతుంది.

ఈ మూవీ సిద్దుకి కచ్చితంగా హిట్టు ఇస్తుందని నమ్మకంతో మూవీ టీం ఉంది. రీసెంట్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో సిద్దు జొన్నలగడ్డ జాక్(Jack)అనే మూవీ రిలీజ్ అయింది. ఇది ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అవ్వలేదు. జాక్ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న సిద్ధూ.. మూవీ బోల్తా కొట్టడంతో తన నెక్స్ట్ మూవీ తెలుసు కదా తో మళ్ళీ హిట్టు ట్రాక్ ఎక్కాలని అనుకుంటున్నాడు.

అక్టోబర్ 17 న రిలీజ్…

ఇక అక్టోబర్ 17న వస్తున్న ఈ మూవీతో సిద్దు (Siddhu jonnalagadda) ఆడియన్స్ ని మెప్పిస్తాడని మూవీ టీం నమ్మకంతో ఉంది. టాప్ ప్రొడక్షన్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబట్ల ఈ మూవీని నిర్మిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కి తమన్ మ్యూజిక్ పెద్ద ఎస్సేట్ అవుతుందనటంలో సందేహం లేదు. దీపావళి కానుకగా వస్తున్న మూవీపై ఆడియన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంచనాలను అందుకునేలా ఈ మూవీ ఉంటుందని సిద్ధూ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!