Singer Kalpana : ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఆత్మహత్యాయత్నం (suicide attempt) కలకలం సృష్టించింది. సినిమా ఇండస్ట్రీనే కాకుండా ఆమె అభిమానులకు ఇది దిగ్భ్రాంతిని కలిగించింది. రెండు రోజులుగా అపస్మారక స్థితి (unconscious)లో ఉన్నట్టు గుర్తించిన ఇరుగుపొరుగు వారు కల్పనను ఆస్పత్రిలో చేర్పించగా ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. అయితే.. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్పన నిజంగానే ఆత్మహత్యాయత్నం చేశారా.. మరేదైనా అఘాయిత్యం జరిగిందా? ఆత్మహత్య చేసుకోవాలనే అనుకుంటే ఆ పరిస్థితి ఆమెకు ఎందుకు వచ్చింది? అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఎలా బయటపడింది ఈ విషయం?
హైదరాబాద్‌లో కల్పన నివసిస్తుండగా రెండు రోజులుగా తలుపులు లోపలి నుంచి మూసి ఉండటంతో అపార్ట్‌మెంట్ సెక్యూరిటీకి అనుమానం వచ్చింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, పక్కింటి వారు ఆమెను పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో వారు ఆందోళన చెందారు. చివరకు ఫ్లాట్ అసోసియేషన్ వారు ఆమె భర్తకు ఫోన్ చేశారు. ఆ సమయంలో ఆయన చెన్నైలో ఉన్నారు. హైదరాబాద్‌కు రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆయన పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కల్పన ఇంటికి చేరుకున్న పోలీసులు తెలుపులు తెరవమని బిగ్గరగా ఆమెను పిలిచారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో బలవంతంగా తెలుపులు తెరచి (forced entry) లోపలికి ప్రవేశించారు. లోపల ఆమె అపస్మారక స్థితి (unconscious)లో పడిఉండటాన్ని గుర్తించారు. అనంతరం కల్పనను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై ఉన్నారు.
ఏం జరిగి ఉంటుంది?
కల్పన నిద్ర మాత్రలు అధికంగా తీసుకున్నారని తెలుస్తోంది. అయితే.. ఇది ఆత్మహత్యాయత్నమా లేదా ప్రమాదవశాత్తూ జరిగిందా? లేదా ఏదైనా అఘాయిత్యం చోటు చేసుకుందా? అనే విషయంలో స్పష్టత లేదు. చెన్నైలో ఉన్న ఆమె భర్త హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇప్పటి వరకు ఈ ఘటనపై ఆయన ఏమీ మాట్లాడలేదు.
Singer Kalpana : సినీ ప్రపంచంలో ప్రస్థానం
కల్పనా రాఘవేందర్ ప్రముఖ సంగీత దర్శకుడు టి.ఎస్. రాఘవేంద్ర కుమార్తె. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ కలిగి ఉన్న ఆమె ఇప్పటికే 1,500 పైగా పాటలను పాడారు. ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్, ఎం.ఎం. కీరవాణి వంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి Singer Kalpana పనిచేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అనేక పాటలు పాడారు. 2010లో “స్టార్ సింగర్” రియాలిటీ షోలో విజేతగా నిలిచారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో ఆమె పాల్గొన్నారు. వివిధ సంగీత రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా కూడా పనిచేశారు. పున్నగై మన్నన్ సినిమాలో చిన్న పాత్రలో నటించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..