Sarkar Live

Student visa | అమెరికాలో వీసాల రద్దు… విదేశీ విద్యార్థులకు గ‌డ్డుకాలం

Student visa : అమెరికా (US)లో చదువుతున్న విదేశీ విద్యార్థుల (international students)కు గ‌డ్డుకాలం మొదలైంది. చిన్న చిన్నట్రాఫిక్ ఉల్లంఘనలు (traffic violations) వంటి కారణాలతో విద్యా వీసా (Student visa)లను అక్కడి అధికారులు రద్దు చేస్తుండటం కలకలం రేపుతోంది. ముఖ్యంగా

Student visa

Student visa : అమెరికా (US)లో చదువుతున్న విదేశీ విద్యార్థుల (international students)కు గ‌డ్డుకాలం మొదలైంది. చిన్న చిన్నట్రాఫిక్ ఉల్లంఘనలు (traffic violations) వంటి కారణాలతో విద్యా వీసా (Student visa)లను అక్కడి అధికారులు రద్దు చేస్తుండటం కలకలం రేపుతోంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థుల (Indian students)పై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఏం జరుగుతోంది అసలు?

ఇటీవల అమెరికాలో ఉన్న వందలాది విదేశీ విద్యార్థుల (international students)కు వారి విద్యాసంస్థల నుంచి (Designated School Officials – DSOs) ఒక షాక్ ఇచ్చే ఈ-మెయిల్స్ వచ్చాయి. అందులో వారి F-1 విద్యార్థి వీసా రద్దు అయిందని, వారు తక్షణమే దేశాన్ని విడిచి వెళ్లాల‌ని ఆదేశించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం (లేన్ మార్పు నిబంధనలు పాటించకపోవడం), మద్యం మత్తులో డ్రైవింగ్ లాంటి చిన్న చిన్న కార‌ణాలను చూపారు. ఈ నేరాలన్నీ విద్యార్థులు గతంలోనే చట్టపరంగా పరిష్కరించుకున్నప్పటికీ ఇప్పుడు వాటినే సాకుగా చూపుతూ వీసాలను రద్దు చేస్తున్నారు.

147 మంది విద్యార్థులపై ప్రభావం

న్యూయార్క్ టైమ్స్ (New York Times -NYT) కథ‌నం మేర‌కు.. ఇప్పటికే 147 మంది అంతర్జాతీయ విద్యార్థులు (international students) అమెరికా లో ఉండే హక్కు (right to remain in the US)ను కోల్పోయారు. వీరిలో అనేకమంది భారతీయులు ఉన్నారు. దీనిపై హైదరాబాద్‌కు చెందిన కొందరు విద్యార్థులు మాట్లాడుతూ “మేము అప్పట్లోనే కోర్టుకు హాజ‌రు కావ‌డం, ఫైన్స్ క‌ట్ట‌డం లాంటివి పూర్తి చేశాం. మా కేసులు మాఫీ అయ్యాయి. ఆ కేసుల‌నే సాకుగా చూపుతూఊ ఇప్పుడు వీసా ర‌ద్దు చేయ‌డం బాధాక‌రం” అని ఆవేదన వ్యక్తం చేశారు.

Student visa : త‌గ్గుతున్న సంఖ్య

అమెరికాలో విద్యార్థి వీసాల (Student visa) జారీలో గత రెండేళ్ల‌ల్లో గ‌ణ‌నీయ‌ తగ్గుదల కనిపిస్తోంది. 2023-24లో 6.79 లక్షల దరఖాస్తుల్లో 2.79 లక్షల వీసాలను నిరాకరించారు. 2022-23లో ఈ నిరాకరణ రేటు 36 శాతం ఉండగా, ఇప్పుడు అది 41 శాతానికి చేరుకుంది. మొత్తం జారీ అయిన వీసాల సంఖ్య 2022-23లో 4.45 లక్షలు. అయితే 2023-24లో ఆ సంఖ్య 4.01 లక్షలకు తగ్గిపోయింది.

భారత విద్యార్థులకు దెబ్బ

భారతీయుల వీసాల జారీలో కూడా తీవ్రంగా తగ్గుదల చోటుచేసుకుంది. 2023లో జనవరి నుంచి సెప్టెంబరు వరకు 1.03 లక్షల వీసాలు జారీ కాగా అదే 2024లో 63,973 వీసాలు మాత్రమే జారీ అయ్యాయి.అయితే, ఈ తగ్గుదల తర్వాత కూడా అమెరికాలో విదేశీ విద్యార్థులలో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారని “Open Doors 2024” రిపోర్ట్ చెబుతోంది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ అధిక వీసా నిరాకరణలకు ప్రత్యేకంగా ఏ కారణాన్నీ వెల్లడించలేదు. కానీ, Immigration and Nationality Act ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని మాత్రమే చెప్పింది. అంతేకాదు.. 2019 నుంచి డేటా విధానంలో మార్పులు చేయడంతో గత గణాంకాల‌తో పోలికలు కష్టంగా మారాయని అధికారులు చెబుతున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!