Sarkar Live

Summer Vacation | పిల్లల‌కు ఇక పండ‌గే..

Summer Vacation : సంవ‌త్స‌ర‌మంతా పుస్త‌కాల‌తో కుస్తీ ప‌డిన పిల్ల‌లు వేస‌వి సెల‌వుల (Summer Vacation) కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి నిరీక్ష‌ణ ముగియ‌నుంది. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి. ఏడాదంతా

Summer Vacation

Summer Vacation : సంవ‌త్స‌ర‌మంతా పుస్త‌కాల‌తో కుస్తీ ప‌డిన పిల్ల‌లు వేస‌వి సెల‌వుల (Summer Vacation) కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి నిరీక్ష‌ణ ముగియ‌నుంది. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి. ఏడాదంతా హోం వర్క్, ప్రాజెక్టులు, పరీక్షల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయిన పిల్ల‌లు రిలాక్స్ అయ్యే టైం వచ్చేసింది.

Summer Vacation : హాలి డేస్ ఎప్ప‌టి నుంచి అంటే…

తెలంగాణ‌లో పాఠ‌శాల విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు (Summer Holidays) ఈ సంవ‌త్స‌రం ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 11 వరకు.. మొత్తం 49 రోజుల పాటు ఇవి కొన‌సానున్నాయి.
ప్రస్తుతం ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఏడో త‌ర‌గ‌తి వరకు చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన స‌మ్మెటివ్ అసెస్మెంట్ ప‌రీక్ష‌లు (Summative Assessment – II Exams) ఏప్రిల్ 17 నాటికి పూర్తికానున్నాయి. అలాగే, ఎనిమిదో త‌ర‌గ‌తి నుంచి తొమ్మిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు చివరి పరీక్ష అయిన సోష‌ల్ స్ట‌డీస్ (Social Studies) ప‌రీక్ష‌ కూడా అదే రోజున జరగనుంది. పరీక్షలు పూర్తయిన వెంటనే పిల్లలు సెల‌వుల మూడ్‌లోకి వెళ్లిపోతారు. అధికారికంగా మాత్రం ఏప్రిల్ 24 నుంచి సెల‌వులు మొద‌లు కానున్నాయి.

ఏప్రిల్ 23లోగా రిజ‌ల్ట్స్ ప్ర‌క‌ట‌న‌

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ఏప్రిల్ 23 నాటికి అన్ని పాఠశాలలు విద్యార్థుల‌కు ప్రొగ్రెస్ కార్డులు (Progress Cards) ఇవ్వాలి. అదే రోజుఉ పేరెంట్స్ మీటింగ్ (Parent-Teacher Meetings) జరగాలి. ఈ సమావేశాల్లో ఉపాధ్యాయుల నుంచి తమ పిల్లల ప్రగతిపై తల్లిదండ్రులు స్పష్టమైన సమాచారం పొందొచ్చు. ఇది పిల్లల బలాబలాలపై అవగాహన పెంచేందుకు, తద్వారా తదుపరి చదువును మెరుగుపర్చేందుకు చాలా ఉపయోగపడుతుంది.

ముఖ్య‌మైన తేదీలు

  • ఏప్రిల్ 17 : చివరి పరీక్ష
  • ఏప్రిల్ 23 : ఫలితాల ప్రకటన, తల్లిదండ్రుల సమావేశం
  • ఏప్రిల్ 24 : వేసవి సెలవుల ప్రారంభం
  • జూన్ 11 : వేసవి సెలవుల ముగింపు
  • జూన్ 12 : కొత్త విద్యా సంవత్సరం ఆరంభం

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!