Google Ai : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సంచనాల దశగా గూగుల్..
Google Ai : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై గూగుల్ (Google) మరింత దృష్టిని కేంద్రీకరించింది. జెమినీ 2.0, విలో లాంటి ప్రాజెక్టుల విజయాల తర్వాత మరింత ముందడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయి (Google CEO Sundar Pichai) తమ లక్ష్యాలను వెల్లడించారు. 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై గూగుల్ దృష్టి కేంద్రీకరించిందని ఆయన తెలిపారు. 2024లో ఆర్టిఫిషియల్ రంగం సాధించిన విజయాల నేపథ్యంలో గూగుల్ 2025లో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించిందని సుందర్ పిచాయి వివరించారు.
మరింత కొత్తగా Google Ai
గూగుల్ సాధించిన విజయాలు అనేక ఉన్నా.. 2024లో తమ ఖాతాలో మరిన్ని వచ్చి చేరాయని సుందర్ పిచాయి తెలిపారు. సెర్చ్, యూట్యూబ్, క్లౌడ్, ఆండ్రాయిడ్, పిక్సెల్ వంటి విభాగాల్లో AI ద్వారా సాధించిన ప్రగతిని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ వ...