MMTS Trains | చర్లపల్లి స్టేషన్ కు చేరుకునేదెలా…?
MMTS Trains | విమానాశ్రయం తరహాలో అత్యాధునిక హంగులతో అభివృద్ధిచేసిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapalli Railway terminal) ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి నుంచి కొన్ని రైళ్లను కూడా ప్రారంభించింది దక్షిణ మధ్ రైల్వే.. ప్రయాణికులతో పోటెత్తుతున్న సికింద్రాబాద్(Secunderabad), నాంపల్లి, కాచిగూడ రైళ్లే స్టేషన్లపై ఒత్తడిని తగ్గించేందుకుచర్లపల్లి నుంచి మరిన్ని రైళ్లను నడిపించాలని భారతీయ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది.
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌నుంచి 25 జతల రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. సికింద్రాబాద్ లో ఒత్తిడి తగ్గించి తొలిదశలో 10 జతల రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించనుంది. కానీ ఇక్కడ ప్రధానమైన సమస్య ఎదురవుతోంది. చర్లపల్లికి కనెక్టివిటీకి అవసరమైన ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పటివరకు అందుబాటులో లేవు. ప్రస్తుతం ఈ మార్గంలో ఒకే ఎంఎంటిఎస్ ర...