Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..
నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలాల పరిధిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు (Earthquake) చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్ల నుంచి ప్రజలు పరుగులు పెడుతూ రోడ్లపైకి వొచ్చారు. ఈ భూ ప్రకంపనలు సుమారు నాలుగు సెకండ్ల పాటు కొనసాగినట్లు స్థానికులు వెల్లడించారు. గత మే నెల 6న కూడా ప్రకాశం జిల్లాలో ఇదే మాదిరిగా భూకంపం సంభవించిందని తెలిపారు. పొదిలిలో ఉదయం 9.54 గంటల సమయంలో భూమి కంపించడంతో ఆ ప్రాంతం ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఆ సమయంలో కూడా సుమారు ఐదు సెకండ్లపాటు ప్రకంపనలు కొనసాగినట్లు నివేదికలు తెలిపాయి. కొత్తూరు పరిధిలోని రాజు హాస్పిటల్ వీధి, ఇస్లాంపేట, బ్యాంక్ కాలనీ తదితర ప్రాంతాల్లో స్పష్టంగా ప్రకంపనలు గుర్తించారు.
తెలంగాణలోనూ భూకంపం (Ea...