Panchayat Elections | ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు..!
3 విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం
సర్పంచ్ ఎన్నికల తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
గ్రామాల్లో మొదలు కానున్న సందడి
సంతానం నిబంధన ఎత్తివేతతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర పోటీ
Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు (Telangana Govt) తీవ్ర కసరత్తు చేస్తోంది. నూతన సంవత్సరంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2025 ఫిబ్రవరి లోనే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించి అనంతరం జడ్పిటిసీ, ఎంపిటిసి ఎన్నికలను నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను ఒకేరోజు జరిపితే ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయమని ముందుగానే గుర్తించిన ఎన్నికల సంఘం.. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది. సర్పంచ్ ఎన్న...