Post Office Recruitment 2025 | పోస్టల్ శాఖలో భారీ నియమకాలు.. టెన్త్ పాసైతే చాలు..
Post Office Recruitment 2025 : భారతీయ తపాలా శాఖ (India Post) మరో నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak (GDS)) పోస్టులను నియమించనున్నట్టు ప్రకటించింది. భారతదేశంలోని వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఉన్న 2,1413 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలిపింది.
నియమించనున్న ఉద్యోగాలు ఇవే..
ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM), డాక్ సేవక్ ఉద్యోగాల్లో పోస్టల్ శాఖ నియామకాలు చేపట్టనుంది. ఇందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నియామకాలకు ఎలాంటి పరీక్ష ఉండదు. మెరిట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకొని నేరుగా ఉద్యోగావకాశం కల్పిస్తారు.
Post Office Recruitment కు విద్యార్హతలు
గ్రామీణ డాక్ సేవక్ GDS నియామకానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాస్ అయ్యుండాలి. అభ్య...