Govt land | ప్రభుత్వ భూమి ఆక్రమణకు స్కెచ్ ?
చూపించేది ఓ సర్వే నెంబర్ .. ప్రహారీ నిర్మించింది ప్రభుత్వ భూమిలో..
కోటి విలువైన ప్రభుత్వ భూమిపై కన్నేసిన కాంట్రాక్టర్ ..
Govt land Occupation : ప్రభుత్వ భూమిని తన వశం చేసుకునేందుకు ఓ కాంట్రాక్టర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 1 కోటి కి పైగా విలువ చేసే ఆ భూమిని దక్కించుకునేందుకు అతను వేసిన స్కెచ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందేనట. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఆ భూమి ఉండటం, అక్కడ భూముల రేటు కోట్లల్లో ఉండటంతో సదరు వ్యక్తి కన్ను ఆ భూమిపై పడినట్లు సమాచారం.
సదరు కాంట్రాక్టర్ తనకున్న పలుకుబడితో ఆ భూమిలో ప్రహారీ నిర్మించి రెవెన్యూ అధికారులను సైతం అటువైపు చూడకుండా ఆమ్యామ్యాలతో మేనేజ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం వంగపహాడ్ శివారు ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి 516 సర్వే నెంబర్ లోని 10 గుంటల భూమిని ఓ కాంట్రాక్టర్ చదును చేసి ప్రహరీని కూడా కట్టినట...




