Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అనర్హుల గుర్తింపు షురూ..
Indiramma Atmiya Bharosa Scheme : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రైతు కూలీల కోసం ప్రత్యేకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. ఈ స్కీమ్ కింద రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయాన్ని రెండు విడతలుగా అందించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి ఆన్‌లైన్‌లో వివరాల నమోదుకు ఇప్పటికే గడువు పూర్తయింది. గ్రామ సభలు, మండల కార్యాలయాల్లో నాలుగు రోజులపాటు దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,24,487 కొత్త దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి దాదాపు సుమారు 6 లక్షల మందిని లబ్ధిదారులను ఎంపిక చేసింది. కొత్తగా వచ్చిన 2,24,487 అప్లికేషన్లలో 19,193 దరఖాస్తులను ఆమోదించారు. 1,44,784 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యయాయి. మరో 59,542 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. ఇందిరమ్మ...