SBI Clerk Notification 2024 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్‌బిఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
SBI Clerk Notification 2024 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకి శుభవార్త అందించింది. భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు 2024-25 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన విద్యార్హతలు, ఇతర వివరాలు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఖాళీల సంఖ్య
యావత్ భారతదేశం వ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణలో 342 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్‌లో 50 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియ.. గడువు తేదీలు
జూనియర్ అసోసియేట్ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ : 2024 డిసెంబర్ 17
దరఖాస్తు చివరి తేదీ : 2025 జనవరి 7
దరఖాస్తు లింక్ : [SBI Careers](https://bank.sbi/web/careers/current-openings...