Lava Shark | 50MP కెమెరా, 120Hz డిస్ప్లేతో లావా షార్క్ రూ.6,999కి లాంచ్
Lava Shark Smart Phone | భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ లావా , లావా షార్క్ లాంచ్‌తో తన పోర్ట్‌ఫోలియోకు కొత్త లైనప్‌ను తీసుకొచ్చింది. లావా షార్క్ UNISOC T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6.67-అంగుళాల పంచ్-హోల్ డిస్‌ప్లేను HD+ రిజల్యూషన్ (120Hz రిఫ్రెష్ రేట్)తో పాటు 50MP AI వెనుక కెమెరాను కలిగి ఉంది.
Lava Shark : ధర
4GB RAM + 64GB స్టోరేజ్: రూ. 6,999
రంగు: టైటానియం గోల్డ్, స్టెల్త్ బ్లాక్
ఈ వారం నాటికి లావా రిటైల్ అవుట్‌లెట్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
లావా షార్క్: వివరాలు
లావా షార్క్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల HD+ పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దుమ్ము, నీటి తుంపరలకు నుంచి రక్షించేందుకు ఈ పరికరం IP54-రేటెడ్ కలిగి ఉంది. ఇది 4GB RAM, 64GB స్టోరేజ్ తో ఉన్న UNISOC T606 ద్వారా శక్తిని పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫిం...




