Tirupati | తిరుమలలో మరోసారి సిట్.. లడ్డూ తయారీ పరిశీలన
Tirupati : ఆంధ్రప్రదేశ్‌లో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పాకశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) శనివారం ఉదయం పరిశీలించిందని తెలుస్తోంది. తిరుమల లడ్డూ (ప్రసాదం) తయారీ విషయంలో వచ్చిన వివాదంపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బృందంలోని ఆరుగురు సభ్యులు సందర్శించారు. ఆలయంలోని పలు విభాగాలను పరిశీలించారు.
నాణ్యతపై నజర్
ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ)లోని ఆరుగురు సభ్యులు తిరుపతిలో పర్యటించారు. లడ్డూ తయారీపై దర్యాప్తు చేస్తున్న ఈ బృందం ఆలయంలోని పలు విభాగాలను పరిశీలించిందని, లడ్డూ తయారయ్యే పాకశాలను సందర్శించిందని పలు మాధ్యమాలు వెల్లడించాయి. లడ్డూ నాణ్యతను పరీక్షించే ప్రయోగశాల కూడా ఈ టీమ్ సభ్యులు పరిశీలించారని తెలుస్తోంది. లడ్డూకు ఉపయోగించే పిండిని తయారు చేసే మిల్లును కూడా పరిశీలించినట్టు సమాచారం. ప్రసాదం నాణ్య...