- పెండింగ్ బిల్లులకు రూ. 707.30 కోట్లు విడుదల
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Telangana Employees) తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు, పెండింగ్ బిల్లులకు సంబంధించిన రూ. 707.30 కోట్లను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు, ఆర్థిక శాఖ అధికారులు శనివారం నవంబర్ నెలకు సంబంధించిన ఈ నిధులను విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల రూ. 700 కోట్లకు పైగా నిధులను క్రమం తప్పకుండా విడుదల చేస్తూ వస్తోంది. నాలుగు నెలలుగా బకాయిల చెల్లింపు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వరుసగా నాలుగు నెలలుగా ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ వస్తోంది. నవంబర్ నెలలో విడుదల చేసిన ఈ రూ. 707.30 కోట్ల నిధుల్లో ముఖ్యంగా గ్రాట్యుటీ, జీపీఎఫ్ (GPF), సరెండర్ లీవులు, అడ్వాన్స్‌లకు సంబంధించిన బిల్లులు ఉన్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







