Sarkar Live

Global Summit కు స‌ర్వం సిద్ధం- ముస్తాబైన‌ ఫ్యూచ‌ర్ సిటీ

హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న గ్లోబ‌ల్ స‌మ్మిట్ (Telangana Global Summit)కు స‌ర్వం సిద్ధ‌మైంది. డిసెంబ‌రు 8, 9 తేదీల్లో నిర్వ‌హించే ఈ అంత‌ర్జాతీయ స‌ద‌స్సు (International event)కు దేశ విదేశాల నుంచి ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. హైద‌రాబాద్ స‌మీపంలోని భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ

Telangana Global Summit

హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న గ్లోబ‌ల్ స‌మ్మిట్ (Telangana Global Summit)కు స‌ర్వం సిద్ధ‌మైంది. డిసెంబ‌రు 8, 9 తేదీల్లో నిర్వ‌హించే ఈ అంత‌ర్జాతీయ స‌ద‌స్సు (International event)కు దేశ విదేశాల నుంచి ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. హైద‌రాబాద్ స‌మీపంలోని భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ (Bharat Future City) వ‌ద్ద ఈ స‌మ్మిట్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. ఇది రెండు రోజుల‌పాటు జ‌రిగే స‌ద‌స్సు అయిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత కూడా ప్ర‌జ‌ల ద‌ర్శ‌నార్థం (ప‌బ్లిక్ ఎగ్జిబిష‌న్‌) ఫ్యూచ‌ర్ సిటీని డిసెంబ‌రు 10, 11, 12 తేదీల్లో తెర‌చి ఉంచ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ల‌క్ష్యం ఏమిటి?

తెలంగాణ అభివృద్ధి ల‌క్ష్యం Vision 2047లో భాగంగా ఈ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీని సాధించుకోవాల‌న్న‌ల‌క్ష్యంతో స‌ర్కారు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించింది. దీనిని ప్ర‌పంచానికి చూపించాల‌న్న‌దే ఈ స‌మ్మిట్ ముఖ్యోద్దేశం. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు (Global investors meet), పారిశ్రామికవేత్త‌లు, వివిధ కంపెనీల ప్ర‌తినిధులు, ఆయా రంగాల్లోని నిపుణుల దృష్టిని ఆక‌ర్షించాల‌ని రేవంత్ ప్ర‌భుత్వం భావిస్తోంది.

Telangana Global Summit : డెవ‌ల‌ప్మెంట్ ప్లాట్‌ఫార‌మ్‌

గ్లోబ‌ల్ స‌మ్మిట్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్మెంట్ ప్లాట్‌ఫారమ్‌గా ఉండాల‌న్న‌దే రాష్ట్ర ప్ర‌భుత్వ ల‌క్ష్యం. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ/సెమీ కండక్టర్లు, ఆరోగ్యం, విద్య, టూరిజం, అగ్రికల్చర్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మహిళా వ్యాపారం, స్టార్టప్పులు, సామాజిక సంక్షేమం తదితర రంగాల అభివృద్ధికి అవకాశాలపై చర్చలు, ప్ర‌జెంటేషన్లు, పాలిసీ డైలాగ్‌లతో ఒక సమగ్ర అభివృద్ధి దిశను నిర్దేశించేలా గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు శ్రీ‌కారం చుట్టారు. ఇందులో మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు (sessions/panels) జ‌ర‌గ‌నున్నాయి. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల ప్రగతిని, తీసుకొచ్చిన మార్పులు, ప్రణాళికలు కూడా ప్రజలకు, ప్రపంచానికి ఈ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ద్వారా ప్రదర్శించనున్నారు.

మంత్రుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఏర్పాట్లు

గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వేత్తలు ఈ సమ్మిట్‌కు హాజరుకానుండటంతో ఈ కార్యక్రమాన్ని అత్యున్నత స్థాయిలో నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఫ్యూచ‌ర్ సిటీని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సంద‌ర్శించారు. గ్లోబ‌ల్ సమ్మిట్ ఏర్పాట్ల‌ను వారు ప‌రిశీలించారు. ద‌గ్గ‌రుండి ఎప్ప‌టిక‌ప్పుడు అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు ఇస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ భారీ స్థాయి కార్యక్రమం కానున్న నేప‌థ్యంలో దీనిని విజ‌య‌వంతం చేయ‌డానికి భాగ‌స్వామ్యం అవుతున్నాయి.

హైదరాబాద్‌ ఫ్యూచర్ సిటీలో జరుగనున్న గ్లోబల్ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో సంస్థలు, శాఖలు సమన్వయం (Administrative coordination)తో పనిచేస్తున్నాయి. మంత్రుల ఈ సమీక్షతో పనుల వేగం మరింత పెరిగి, సమ్మిట్‌ను విజయవంతం చేయడానికి అన్ని శాఖలు మరింత కృషి చేయనున్నాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?