Bharat Future City projects : తెలంగాణకు అత్యాధునిక హంగులు సంతరించుకోనున్నాయి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీకి అనేక కీలక మెగా ప్రాజెక్టులు (Mega Projects Telangana) రానున్నాయి. హైదరబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ (Green energy projects), స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులు భారీగా ప్రవేశిస్తున్నాయి.
రూ. 4 వేల కోట్లతో 25 బయోగ్యాస్ ప్లాంట్లు
గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా అహీరత్ హోల్డింగ్స్ సంస్థ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో శుభ్రమైన ఇంధన విప్లవానికి (CBG plants in Telangana ) నాంది పలికే ప్రాజెక్టును స్థాపించనున్నట్టు పేర్కొంది. మొత్తం 25 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటికి రూ. 4,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం–సంస్థల మధ్య MoU కుదిరింది. తమ ప్రాజెక్టు అమలు ప్రణాళికను, అవసరమైన భూముల వివరాలను, పూర్తి కాలవ్యవధిని, పర్యావరణ పరిరక్షణ చర్యలను ఈ సందర్భంగా అహీరత్ హోల్డింగ్స్ సంస్థ వివరించింది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక తెలంగాణ గ్రీన్ ఫ్యూయల్ రంగంలో దేశంలోనే అగ్రస్థానానికి చేరుకునే అవకాశముందని పేర్కొంది.
మోటార్‌స్పోర్ట్‌కు కొత్త దిశ: వరల్డ్-క్లాస్ సూపర్‌క్రాస్ ఫెసిలిటీ
భారత్ ఫ్యూచర్ సిటీలో మరో ఆకర్షణీయమైన ప్రాజెక్టు స్థాపనకు సంబంధించిన ప్రకటన వెలువడింది. భారత మోటార్‌స్పోర్ట్స్ రంగానికి కొత్త శకానికి నాంది పలుకుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సూపర్‌క్రాస్ & మోటోక్రాస్ రేసింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సూపర్‌క్రాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రొఫెషనల్ డర్ట్ ట్రాక్స్, రైడర్ ట్రైనింగ్ జోన్లు, ప్రేక్షకుల కోసం ప్రత్యేక వసతులు, హాస్పిటాలిటీ (రిసార్ట్ & ఫుడ్ జోన్‌లు) వంటి ఆధునిక సౌకర్యాలు ఉండనున్నాయి.
Salman Khan Ventures film city : రూ. 10 వేల కోట్ల మెగా టౌన్‌షిప్
అత్యంత ఆకర్షణీయమైన ప్రాజెక్ట్‌గా సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ భారీ పెట్టుబడిని ప్రకటించింది. మొత్తం రూ. 10,000 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్, ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌లో లగ్జరీ హాస్పిటాలిటీ, స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హైఎండ్ లీజర్ జోన్లు, వరల్డ్ క్లాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో, ప్రతిభ అభివృద్ధి కార్యక్రమాలు, చాంపియన్‌షిప్ గోల్ఫ్ కోర్స్ తదితర సౌకర్యాలు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్ట్ (Salman Khan Ventures film city) రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీకి భారీ ఊతం ఇవ్వనుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రత్యేకంగా ఫిల్మ్ ప్రొడెక్షన్, స్టూడియోలు, టెక్నికల్ ట్రైనింగ్ రంగాల్లో ఇది ఒక పెద్ద మార్పు తీసుకురానుంది.
హెల్త్‌కేర్ రంగంలో మరో అడుగు : 400 పడకల Apollo Hospital
తెలంగాణ ప్రభుత్వం, అపోలో గ్రూప్ మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో 400 పడకల కొత్త టర్టియరీ హాస్పిటల్ (Apollo new hospital in Hyderabad)ను నిర్మించనున్నట్టు అపోలో గ్రూప్ ప్రకటించింది. అపోలో హెల్త్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్ ద్వారా అదనంగా క్లినిక్‌లు, డయాగ్నస్టిక్స్, వెల్‌నెస్ సెంటర్లు వంటి రంగాల్లో మరో రూ. 371 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు వెల్లడించింది.







