Sarkar Live

Employees Insurance : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ భరోసా: రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా షురూ!

Telangana Govt Employees Insurance 2026 : ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందనే విషయాన్ని చాటిచెబుతూ, రెగ్యులర్ ఉద్యోగులందరికీ ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో భట్టి విక్రమార్క గారు ఈ

Telangana Budget 2026-27

Telangana Govt Employees Insurance 2026 : ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందనే విషయాన్ని చాటిచెబుతూ, రెగ్యులర్ ఉద్యోగులందరికీ ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో భట్టి విక్రమార్క గారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారి వివరాలను వెల్లడించారు.

ముఖ్యాంశాలు:

  • బీమా మొత్తం: రూ. 1.02 కోట్లు (ప్రమాదవశాత్తు మరణిస్తే).
    లబ్ధిదారులు: రాష్ట్రంలోని 5.14 లక్షల మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు.
    రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో చర్చలు సఫలమయ్యాయి. జీతాల ఖాతాల (Salary Accounts) ఆధారంగా ఈ బీమా వర్తించనుంది.
  • ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం గానీ, ఉద్యోగులు గానీ ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.

గతంలోనే సింగరేణి మరియు విద్యుత్ సంస్థల్లో ఈ తరహా బీమాను ప్రభుత్వం ప్రారంభించింది. సింగరేణిలో 38,000 మంది రెగ్యులర్ కార్మికులు ఉన్నారు. విద్యుత్ సంస్థలు (Transco, GenCo, Discoms)లో 71,387 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా
మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల రెగ్యులర్ ఉద్యోగులకు (5.14 లక్షల మంది) ఇది వర్తిస్తుంది.

ఈసందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ముందుగా సింగరేణి, విద్యుత్ కార్మికులతో ప్రారంభమైన ఈ భరోసా, ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి వర్తింపజేయడం గర్వకారణమని అన్నారు. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమ‌ని అన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?