Telangana MLC Candidates | ఎమ్మెల్సే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతిని ఎమ్మెల్సే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసింది. విజయశాంతితో పాటు సినియర్ నాయకుడు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌లను కూడా అభ్యర్థులుగా అవకాశం కల్పించింది. మొత్తం నాలుగు స్థానాల్లో మిగిలిన ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. ఈ మేరకు వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వివరాలను ఆదివారం ప్రకటించారు.
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు (Telangana MLC Candidates) ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఆయా స్థానాలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 10వ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. నామినేషన్ల ఉపసంహరణకు 13 వరకు అవకాశం ఉంది. 20న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి మూడు కాంగ్రెస్ పార్టీకి, ఒకటి బీఆర్‌ఎస్ పార్టీకి వస్తాయి. ఐదవ స్థానం కోసం ఎంఐఎంతో పాటు మరికొన్ని ఓట్లు అవసరమవుతాయి. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు ఓట్లు వేస్తే కాంగ్రెస్‌కు నాలుగో సీటు కూడా లభించే అవకావముంది. అయితే సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు ఎలాంటి వైఖరి అనుసరిస్తారనే వేచి చూడాల్సిందే..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..