Telangana Rains | రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు వరదలు పోటెత్తడంతో పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు చేసింది. రానున్న మూడురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వెల్లడించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ (Red Alert ), మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
సోమవారం కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అతిభారీ వర్షాలుంటాయని తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది.
ఇక బుధవారం ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







