Seasonal flu : తెలంగాణలో ఇన్‌ఫ్లూయెంజా వ్యాధులు (ILI కేసులు) కేసులు విస్తరిస్తున్నాయి. వైరల్ ఫీవర్ల (viral fevers) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వీటి తీవ్రత హైదరాబాద్ (Hyderabad)లో ఎక్కువ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండు వారాలుగా ఆస్పత్రుల్లో అధిక జ్వరం, దగ్గు, శరీరనొప్పులతో వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అంటున్నారు.
Seasonal flu : ఆస్పత్రుల్లో పెరిగిన రద్దీ
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital), ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ( Osmania General Hospital-OGH), నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ (Fever Hospital), NIMSతో పాటు చిన్న క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు కిటకిటలాడుతున్నాయి. ఈ ఆస్పత్రుల్లో వచ్చేవారిలో తీవ్ర జ్వరం, ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు ఉన్న వారే (patients) ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు తెలిపారు. హై టెంపరేచర్, తీవ్రమైన శరీర నొప్పులు, దగ్గు, జలుబు, తలనొప్పి, గొంతు నొప్పి లాంటివి సీజనల్ ఫ్లూ (Seasonal flu), ఇన్‌ఫ్లూయెంజా (influenza) వ్యాధుల లక్షణాలని, వీటితో బాధపడే వారు వెంటనే వైద్యం పొందాలని సూచిస్తున్నారు.
సీజనల్ ఫ్లూ అంటే ఏమిటి?
శ్వాసకోశ సంబంధిత వైరస్ సంక్రమణ అనేది సీజనల్ ఫ్లూ లక్షణం అంటున్నారు వైద్యులు. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుందని, దగ్గు లేదా తుమ్ముతో ఇతరులకు సులభంగా సోకుతుందని పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు ఉన్న వారు సాధారణంగా ఒక వారం లోపే కోలుకుంటారని అంటున్నారు. వైద్యం పొందడంతోపాటు సరిపడా విశ్రాంతి, నీరు, ద్రవపదార్థాలు, పోషకాహారం తీసుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్
సీజనల్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (DPH) డాక్టర్ నాయక్ ఒ ప్రకటన వెలువరించారు. ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని, లేదంటే వ్యాధి తీవ్రత పెరిగి ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని తెలిపారు. ముఖ్యంగా గర్భిణులు, 5 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన పెద్దలు, గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిలో ఎవరికైనా సీజనల్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే తక్షణమే బస్తీ దవాఖాన లేదా సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







