Sarkar Live

Telangana’s vehicle | తెలంగాణ‌లో పెరిగిన వాహ‌నాల వినియోగం.. ఏ స్థాయిలో అంటే..

Telangana’s vehicle : తెలంగాణలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2025 ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో నమోదైన వాహనాల సంఖ్య (registered vehicles) 1.72 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర జనాభా 3.7 కోట్లు కాగా సగటున ప్రతి ఇద్దరికి ఒక వాహనం

Telangana’s vehicle

Telangana’s vehicle : తెలంగాణలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2025 ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో నమోదైన వాహనాల సంఖ్య (registered vehicles) 1.72 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర జనాభా 3.7 కోట్లు కాగా సగటున ప్రతి ఇద్దరికి ఒక వాహనం ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ (State Transport Department) వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం ఈ సంఖ్య వృద్ధి చెందడంలో నగరాల విస్తరణ, ఆర్థిక అభివృద్ధి, ప్రజల ఆదాయ స్థాయిలో పెరుగుదల కీలక కారణాలుగా పేర్కొంది.

ఏయే వాహ‌నాలు ఎన్నెన్ని?

తెలంగాణ వ్య‌ప్తంగా ఉన్న‌ వాహ‌నాల్లో అత్య‌ధికంగా మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. మొత్తం వాహనాల్లో ఇవి 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి. కార్లు, క్యాబ్‌లు 20 శాతం ఉండగా, మిగిలిన 10 శాతంలో ట్రాక్టర్లు, సరుకు రవాణా వాహనాలు, ఆటోలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వాహనాలను విభజిస్తే, 1.2 కోట్ల మోటార్‌సైకిళ్లు, 23.3 లక్షల కార్లు, 7.7 లక్షల ట్రాక్టర్లు , ట్రైలర్లు, 6.5 లక్షల సరుకు రవాణా వాహనాలు, 5.1 లక్షల ఆటో రిక్షాలు ఉన్నాయి.

Telangana’s vehicle : రోజుకు 2 వేల రిజ‌స్ట్రేష‌న్లు

వాహనాల రిజిస్ట్రేషన్ల‌ల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిరోజూ సుమారు 2 వేల కొత్త వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ప్రజల్లో ఆదాయ స్థాయిలో పెరుగుదల, కార్ల ఈఎంఐలు సులభతరం కావడం, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు సబ్సిడీలు అందించడం వంటి అంశాలు వాహనాల రిజిస్ట్రేషన్ పెరుగుదలకు దోహదపడుతున్నట్లు రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు.

పెరుగుతున్న స‌మ‌స్య‌లు

రాష్ట్రంలో పెరుగుతున్న వాహ‌నాల వ‌ల్ల ట్రాఫిక్, వాయు కాలుష్యం పెచ్చుమీరిపోతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించేందుకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, మెట్రో, బస్సు సేవలను మరింత అభివృద్ధి చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలను పెరిగిన ట్రాఫిక్ సమస్యలు, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించే దిశగా బహుళ రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?