Sarkar Live

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల: రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి! – TG Inter Results 2026

TG Inter Results 2026 | తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవ

TG Inter Results 2026

TG Inter Results 2026 | తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవ రావు, విద్యా శాఖ సెక్రటరీ ఐఏఎస్ యోగిత రాణా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. కేవలం 25 రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు ప్రకటించడం విశేషం.

విభాగంవివరాలు
మొత్తం విద్యార్థులుసుమారు 10 లక్షలు
ఫస్ట్ ఇయర్ విద్యార్థులు4,89,126
సెకండియర్ విద్యార్థులు5,07,949
పరీక్షా కేంద్రాలు1,495
మూల్యాంకన కేంద్రాలు20

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

విద్యార్థులు తమ ఫలితాలను రెండు పద్ధతుల్లో తెలుసుకోవచ్చు:

1. అధికారిక వెబ్‌సైట్ ద్వారా:

  • మొదట tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో ‘TS Inter Results 2026’ లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయండి.
  • సబ్‌మిట్ బటన్ నొక్కగానే మీ మార్కుల షీట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

2. వాట్సాప్ ద్వారా (కొత్త ఫీచర్):

ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా కూడా రిజల్ట్స్ పొందే వెసులుబాటు కల్పించారు.

  • 8096958096 నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి.
  • వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపండి.
  • అక్కడ వచ్చే ఆప్షన్లలో ‘ఇంటర్ ఫలితాలు’ సెలెక్ట్ చేసుకోండి.
  • మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే మార్క్స్‌షీట్ కనిపిస్తుంది.

సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు?

పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మే నెలలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. మే చివరి వారంలోనే వీటి ఫలితాలను కూడా వెల్లడించి, విద్యార్థులు పైచదువులకు ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఏపీ ఇంటర్ ఫలితాలపై అప్‌డేట్

తెలంగాణ ఫలితాలు రావడంతో ఏపీ విద్యార్థుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు ఈ నెల 18 లేదా 19వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం డేటా ప్రాసెసింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?