- ఐ పీ ఎస్ కావాల్సిన నేను ఆర్టీసీలో కి వచ్చానని “ధర్మం”గా ప్రచారం చేసుకున్న అధికారి..
- సమ్మెకాలంలో “ఓడి”ల పేరుతో సదరు అధికారి లక్షలు కొల్లగొట్టినట్లు ఆరోపణలు..
- ఆ అధికారి మాయలు “బాపు”కే తెలుసని భూపాలపల్లి లో జోరుగా ప్రచారం
- విజిలెన్స్ విచారణ చేస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం..
TGSRTC Bhupalpally : ఆర్టీసీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన అధికారి ఓ డిపో మేనేజర్ గా ఉన్నప్పుడు” లక్ష్మీ” ని అ”ధర్మం” గా తన జేబులోకి మళ్లించినట్లు ఉద్యోగులు కోడై కూస్తున్నారు. ఆర్టీసీలో డి.వీ.ఎం గా విధులు నిర్వహిస్తున్న సదరు అధికారి తాను ఓ డిపో మేనేజర్ గా విధులు నిర్వహించినప్పుడు అనేక అక్రమాలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. సమ్మె కాలంలో తన ఇష్టానుసారంగా వ్యవహరించి అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాను “ఐపిఎస్ “కావాల్సిన వాడినని అనుకోకుండా ఆర్టీసీలోకి వచ్చానని, సదరు అధికారి “ధర్మం” గా ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.”ఓడి” ల వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన సదరు అధికారి సమ్మెకాలంలో లక్షల రూపాయలు కొల్లగొట్టినట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. సమ్మె కాలంలో భూపాలపల్లి డిపోలో జరిగిన “ఓడి”ల వ్యవహారం పై విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తే విస్తుపోయే అక్రమాలు బయటపడే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతా “బాపు” కే తెలుసని ప్రచారం…
భూపాలపల్లి డిపో ( TGSRTC Bhupalpally Depot ) లో సమ్మెకాలం లో ఏం జరిగింది? ఓడిల పేరుతో మాయ ఎలా చేశారు ? అనే విషయాలన్నీ కూడా “బాపు”కే తెలుసు అని అసలు ఆ అధికారి లీలలు తెలియాలంటే విజిలెన్స్ అధికారులు బాపును సంప్రదిస్తే చాలని ఆ అధికారి డబ్బులు ఎలా దారిమళ్లించాడో తెలుస్తుంది.. అని డిపోలో ప్రచారం జరుగుతోంది. అవినీతి జరిగి సంవత్సరాలు గడిచిపోయిందని ఉన్నతాధికారులు ఎవరు కూడా విచారణ చేసే అవకాశం లేదని సదరు అధికారి ధీమాగా ఉండడం గమనార్హం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “TGSRTC : ఆర్టీసీలో” లక్ష్మీ” మాయ..”