Sarkar Live

TGSRTC : ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..

TGSRTC | హైదరాబాద్ నగర ప్రజలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజల సౌకర్యార్థం ఒక వినూత్నమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘మెట్రో కాంబి టికెట్‌’ (metro combi ticket) ను కేవలం రూ.20 కే

TGSRTC

TGSRTC | హైదరాబాద్ నగర ప్రజలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజల సౌకర్యార్థం ఒక వినూత్నమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘మెట్రో కాంబి టికెట్‌’ (metro combi ticket) ను కేవలం రూ.20 కే ప్రవేశపెడుుతున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా జనరల్ బస్ టికెట్ (GBT) మెట్రో ఎక్స్‌ప్రెస్ , సాధారణ నెలవారీ బస్ పాస్ ఉన్నవారు (Bus pass holders) హైదరాబాద్ అంతటా మెట్రో డీలక్స్ బస్సుల్లో (Metro deluxe buses) ప్రయాణించొచ్చు.

ఇప్పటికే ఉన్న నెలవారీ పాస్ హోల్డర్లకు అప్‌గ్రేడ్ చేసిన ప్రయాణ ఎంపికను అందిస్తుంది. నామమాత్రపు అదనపు ఖర్చుతో వారు ఎక్కువ సౌకర్యాన్ని ఆస్వాదించడానికి ఈ ఆఫ ఉపయోపడుతుంది. హైదరాబాద్‌లోని అన్ని మెట్రో డీలక్స్ సేవలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

ఆర్టీసీలో సమ్మె గుబులు

ఇదిలా ఉండగా, ఆర్టీసీ (TGSRTC) కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఈనెల 7 నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మే 1న అన్ని డిపోల్లో మేడే జెండాను ఎగురవేసింది. ఈనెల 7నుంచి సమ్మెకు సన్నద్ధం కావాలని కార్మికులకు జేఏసీ పిలుపునిచ్చిన విషయం విదితమే.. అయితే మేడే వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న కార్మికుల నుద్దేశించి పలు మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడాలని, కార్మికులకు తాము అండగా ఉంటామని మరోసారి హామీ ఇచ్చారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?