Sarkar Live

Thandel Movie | తండేల్ మూవీకి దేవీనే సెకండ్ హీరో…

Tollywood News | కస్టడీ, థాంక్యూ మూవీస్ ఫ్లాప్ ల తర్వాత ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు (Naga Chaitanya) తండేల్ (Thandel Movie) రూపంలో బ్లాక్ బస్టర్ హిట్టు దక్కింది. విడుదలైన మొదటి రోజే మంచి టాక్

Thandel Movie

Tollywood News | కస్టడీ, థాంక్యూ మూవీస్ ఫ్లాప్ ల తర్వాత ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు (Naga Chaitanya) తండేల్ (Thandel Movie) రూపంలో బ్లాక్ బస్టర్ హిట్టు దక్కింది. విడుదలైన మొదటి రోజే మంచి టాక్ వచ్చింది. సెకండ్ రోజు కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మూవీలో నాగచైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అయింది. డైరెక్టర్ చందు మొండేటి (Chandu mondeti) టేకింగ్ బాగుంది. ఈ మూవీకి మ్యూజిక్ పెద్ద అస్సెట్ గా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ గా డీఎస్పీ ని (Devi Sri Prasad) తీసుకోవడం మంచిదయింది.

అల్లు అర్జున్ ఇచ్చిన సలహా మూవీకి బాగా ప్లస్ అయింది. మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా వేరే వాళ్ళను తీసుకోవాలని అనుకున్నారట. ఈ విషయమై ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind)తన కొడుకు బన్నీకి చెబితే డీ ఎస్పీ నే తీసుకోండి అని చెప్పారట. పుష్పతో బిజీగా ఉన్న ఆయన మూవీకి పనిచేస్తే న్యాయం చేస్తారో లేదో అనుకున్న టీమ్ కి తనే పెద్ద అసెట్ గా నిలిచాడు. అద్భుతమైన పాటలు ఇచ్చి మూవీ పై అంచనాలను పెంచేలా చేశాడు. ప్రతి సీన్ కూడా తనిచ్చిన బీజీఎంతో చాలా ఎలివేట్ అయింది. లవ్ స్టోరీస్ అంటేనే డీఎస్పీకి ఒక పూనకం వచ్చినట్టు ట్యూన్స్ పుట్టుకొస్తాయి. గతంలో ఉప్పెనకు ఎలాంటి పాటలు, బిజిఎం ఇచ్చాడో మనకు తెలుసు.ఆ మూవీ ఓ రేంజ్ లో హిట్టు కావడానికి ఆయన మ్యూజిక్ కూడా ప్రధాన కారణం.

తండేల్ లో నాగచైతన్య, సాయి పల్లవి నటనతో అదరగొట్టేస్తే ఆ తర్వాత క్రెడిట్ మొత్తం డీఎస్పీకే చెందుతుంది. ఎందుకంటే తన వింటేజ్ మ్యూజిక్ తో మూవీస్ లోని సీన్స్ ని చాలా ఎలివేట్ చేశాడు. మూవీ స్టార్టింగ్ లో సాయి పల్లవి ఎంట్రీ సీన్ దగ్గర నుండి దాదాపు నాలుగు నిమిషాల పాటు తనిచ్చిన బిజిఎం ఒక్కసారిగా సొంతం, కలుసుకోవాలని, ఆనందం మూవీస్ లో బిజీఎం ఎలా ఉందో అలా ఒక్కసారిగా 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లాడు.

Thandel Movie : అదిరిపోయేలా బీజీఎం

Thandel Movie లో ముఖ్యంగా నాగచైతన్య, సాయిపల్లవి మధ్య వచ్చే సీన్స్ దగ్గర, సముద్రంలోకి వేటకు వెళ్ళినప్పుడు సాయిపల్లవి బాధపడే సీన్స్ దగ్గర కొట్టిన బీజీఎం మూవీలో చాలా చోట్ల వాడారు. మూవీకి అది ఊపిరిగా పని చేసింది. తర్వాత నాగచైతన్య సముద్రంలోకి వెళ్లకూడదని సాయి పల్లవి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అప్పుడు దేవి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తన నుండి ఆడియన్స్ ఎలాంటి మ్యూజిక్ ని కోరుకున్నారో ఎగ్జాట్ గా అలాంటి బీజీఎం ని ఇచ్చి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. ఇక డీఎస్పీ పని అయిపోయింది అన్న వాళ్లకి క్లైమాక్స్లోతనిచ్చిన బిజిఎంతో గట్టి సమాధానం ఇచ్చాడు.

సాయి పల్లవి, నాగచైతన్య మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ లో వింటే అల్లు అర్జున్ అన్నట్టుగా లవ్ స్టోరీస్ కి దేవిని మించినోడు లేడనిపిస్తోంది. అన్ని సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. ముఖ్యంగా బుజ్జి తల్లి సాంగ్ ని మేల్, ఫిమేల్ వెర్షన్ లో వాడాడు. సుకుమార్ అన్నట్లుగా ఈ సాంగ్ తన కెరీర్ లోనే నిలిచిపోతుంది.ఈ మూవీకి హీరో నాగ చైతన్య అయితే సెకండ్ హీరో మాత్రం దేవీ నే అంటున్నారు ఆడియన్స్.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?