తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం (TGPVWA) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కుసుమ రమేష్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హన్మకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని రెడీన్ రిసార్ట్ & హోటల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ రంగాల్లో ఆయన చేసిన కృషిని, సంఘం పట్ల ఆయనకు ఉన్న అంకితభావాన్ని గుర్తించి రాష్ట్ర కార్యవర్గం ఈ పదవిని అప్పగించింది. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్. వెంకట్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కే. హుస్సేన్, ప్రధాన కార్యదర్శి లడే రవి మాట్లాడుతూ.. కుసుమ రమేష్ వంటి క్రియాశీలక నాయకుడు రాష్ట్ర కార్యవర్గంలో చేరడం వల్ల సంఘం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారంలో ఆయన ముందుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కుసుమ రమేష్ మాట్లాడుతూ.. సంఘం ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. ముఖ్యంగా “కుటుంబ భరోసా” పథకాన్ని రాష్ట్రంలోని మారుమూల గ్రామాల వరకు తీసుకెళ్లి, ప్రతి ఫోటో & వీడియో గ్రాఫర్‌కు అండగా నిలుస్తానన్నారు. యువ ఫోటోగ్రాఫర్లకు ఉపాధి అవకాశాలు పెంచేలా శిక్షణా తరగతులు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి భీమిడి మాధవ రెడ్డి, కుటుంబ భరోసా చైర్మన్ బి. నాగరాజు, క్రమశిక్షణ చైర్మన్ బి. జగదీష్ గౌడ్, మీడియా చైర్మన్ పి. శేఖర్ గౌడ్, జాయింట్ సెక్రటరీ జి. జంగా రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గాదె లింగమూర్తి, కార్యనిర్వాహక అధ్యక్షులు జి. సునీల్ కుమార్, ప్రధాన కార్యదర్శి పి. దయాకర్, కోశాధికారి వి. సత్యనారాయణ, గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు భూపతి సూరిబాబు, కార్యదర్శి బిల్లా రమేష్, కోశాధికారి పాటి రాజు, దామెర మండల అధ్యక్షులు డి. ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.








