Pramod Sarkar
ప్రమోద్ సర్కార్.. డిజిటల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్లైన్ జర్నలిజం, న్యూస్ కవరేజ్, కంటెంట్ మేనేజ్మెంట్, SEO ఆప్టిమైజేషన్ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు.
ప్రస్తుతం Sarkar Live వెబ్సైట్లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Theenmar Mallanna | తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు
Theenmar Mallanna | కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.. దీనిపై నోటీసులు అందించగా దానికి వివరణ ఇవ్వకపోవడంతో మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్
Theenmar Mallanna | కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.. దీనిపై నోటీసులు అందించగా దానికి వివరణ ఇవ్వకపోవడంతో మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారికంగా ప్రకటించింది. పార్టీ నిబంధనలు అతిక్రమిస్తే ఊరుకునేది లేదని పీసీసీ (TPCC) చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం హెచ్చరించారు. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించామని, బీసీ కులగణన ప్రతులను చించడంపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిపారు.
Theenmar Mallanna : వివాదాస్పదమైన వ్యాఖ్యలు
ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీల బహిరంగ సభలో కుల గణన సర్వే, రెడ్డి సామాజిక వర్గంపై తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కులగణనలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారంటూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు (Teenmar Mallanna controversy comments) గుప్పించారు.అంతే కాకుండా రెడ్డి సామాజిక వర్గంపై పరుషపదాలతో దూషనలకు దిగారు.ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మల్లన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సామాజిక వర్గం నేతలు ఫిర్యాదు చేశారు
అది పార్టీ అధిష్ఠానం నిర్ణయమే..
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Theenmar Mallanna ) సస్పెన్షన్‌పై టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ స్పందించారు. తీన్మార్ మల్లన్న విషయంలో ఏఐసీసీ (AICC) నిర్ణయం తీసుకుందన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారికి ఇది ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు కఠిన తప్పవని మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులను హెచ్చరించారు.
కాగా తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ విధిస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.. ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలపై మల్లన్నను కమిటీ వివరణ ఇవ్వాలని కోరింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని మల్లన్నకు కమిటీ గడువు ఇచ్చింది. అయితే దీనిపై వివరణ ఇవ్వకపోవడంతో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
Pramod Sarkar
More Posts
Theft Gang | వింత దొంగల ముఠా గుట్టు రట్టు – నకిలీ వాంతులతో నగలు దోచే మహిళా గ్యాంగ్
Read More »Vikarabad | వికారాబాద్ జిల్లాలో దారుణం – భార్య, వదిన, కూతురిపై కత్తితో దాడి చేసి ఆత్మహత్య
Read More »Colleges Bandh | 3 నుంచి ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్
Read More »కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు కారణాలివే.. – Kasibugga temple stampede
Read More »గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్.. ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రి పాలు – Food Poisoning
Read More »IAS transfers | రాష్ట్రంలో పలువురు ఐఎఎఎస్‌ల బదిలీ
Read More »Telangana Govt| తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!
Read More »Allu Arjun | అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఇన్నికోట్లా?
Read More »Khammam | సీపీఎం సీనియర్ నాయకుడి దారుణ హత్య
Read More »Web Stories
Gallery
Bhagyashri Borse | భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ స్టిల్స్ – మిస్టర్ బచ్చన్ బ్యూటీ పిక్స్!
Ivana | టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ
Rajma | కిడ్నీ బీన్స్ ఎవరు తినకూడదు?
Recent Posts