Sarkar Live

Tirumala Tirupati | తెలంగాణ ఎమ్మెల్యేల లెట‌ర్ల‌పై ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు షురూ.. టీటీడీ అప్‌డేట్స్‌

Tirumala Tirupati : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చిన సిఫార్సు లేఖల (recommendation letters) ఆధారంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో భక్తుల (devotees)కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ప్రారంభం కానున్నాయి. రేప‌టి (మార్చి 24) నుంచి ఇది అమ‌ల్లోకి రానుంది.

TTD Board meeting

Tirumala Tirupati : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చిన సిఫార్సు లేఖల (recommendation letters) ఆధారంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో భక్తుల (devotees)కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ప్రారంభం కానున్నాయి. రేప‌టి (మార్చి 24) నుంచి ఇది అమ‌ల్లోకి రానుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు (N Chandrababu Naidu) ఆదేశాల మేర‌కు ఈ ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని టీటీడీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Tirumala Tirupati : విశేష దర్శన ఏర్పాట్లు

కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి కార్యక్రమం, ఉగాది పండుగ కారణంగా మార్చి 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాల (darshans)ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు టీటీడీ అధికారులు తెలిపారు. మార్చి 24, 29 తేదీల్లో వీఐపీ దర్శనం కోసం సిఫార్సు లేఖలు స్వీకరించబడవ‌ని వెల్ల‌డించారు

ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల

మరోవైపు టీటీడీ అధికారులు (Tirumala Tirupati Devasthanam officials) జూన్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లు మార్చి 24న విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు జూన్ నెలకు సంబంధించిన వసతి కోటా టికెట్లను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్‌

భక్తులు తమ దర్శనం టికెట్లు అధికారిక వెబ్‌సైట్ (https://ttdevasthanams.ap.gov.in) ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని, ఇతర ఏజెంట్లు లేదా మోసపూరిత వర్గాలపై నమ్మకం పెట్టుకోవద్దని టీటీడీ హెచ్చరించింది.

Tirumala Tirupati : తాజా నిర్ణయాలు ఇవే..

  • మార్చి 24 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఆధారంగా భక్తులకు వీఐపీ దర్శనం.
  • మార్చి 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు.
  • మార్చి 24, 29 తేదీల్లో సిఫార్సు లేఖలు స్వీకరించరు.
  • రూ.300 దర్శనం టికెట్లు జూన్ నెల కోసం మార్చి 24 న విడుదల.
  • వసతి కోటా టికెట్లు కూడా మార్చి 24 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల.

భక్తులు తమ దర్శన ఏర్పాట్లను ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?